కరోనాకి చెక్ పెట్టేందుకు సర్కార్ కీలక నిర్ణయం

byసూర్య | Sat, Mar 28, 2020, 05:18 PM

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 59కి చేరడంతో సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారికి జియో ట్యాగింగ్ ఇవ్వబోతున్నారు. దీని ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారి చేతికి బ్యాండ్ వేస్తారు. దానికి ఓ నంబర్ ను ఇస్తారు. అది జీపీఎస్ లోకేషన్ తో పని చేస్తుంది. దాని ద్వారా వారు ఎక్కడికి వెళ్లినా జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించవచ్చు. విదేశాల నుంచి వచ్చిన వారు, క్వారంటైన్ లో ఉన్న వారు తాము ఉన్న ప్రాంతం నుంచి 50 మీటర్ల దూరం వెళితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకి మెసేజ్ పోతుంది. దాంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారు. దీనికి సంబంధించి ప్రత్యేక యాప్ ను తయారు చేశారు. ఏపీలో ఇప్పటికే ఇలాంటి యాప్ అమల్లో ఉంది. ఇప్పుడు తెలంగాణలో అమలు చేయనున్నారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM