హైదరాబాద్‌లో పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించిన ప్రభుత్వం

byసూర్య | Sat, Mar 28, 2020, 01:15 PM

హైదరాబాద్‌లో పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించిన ప్రభుత్వం
- చందానగర్‌, కోకాపేట, తుర్కయంజాల్‌, కొత్తపేట ఈ పరిధిలోకి
- ఈ ప్రాంతాల వారు 14 రోజులు ఇళ్లకే పరిమితం కావాలి
- నిత్యావసరాలు కూడా ఇంటికే సరఫరా చేస్తారు
కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ నగరం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాలుగు కీలక ప్రాంతాలను రెడ్‌జోన్‌ పరిధిలోకి చేర్చింది. చందానగర్‌, కోకాపేట, తుర్కయంజాల్‌, కొత్తపేట ప్రాంతాలను రెడ్‌జోన్‌లో చేర్చిన ప్రభుత్వం ఈ ప్రాంతాల వారు వంద శాతం ఇళ్లకే పరిమితం కావాలని నిర్దేశించింది. పద్నాలుగు రోజులపాటు వీరు ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, నిత్యావసరాలు కావాలంటే వారి ఇళ్లకే సరఫరా చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.


Latest News
 

యాదాద్రి శ్రీవారిని దర్శించుకున్న ఐజిపి Fri, Mar 29, 2024, 10:32 AM
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి...! Fri, Mar 29, 2024, 10:26 AM
కేసీఆర్ ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి: విజయశాంతి Fri, Mar 29, 2024, 10:19 AM
జైలు అధికారులు వసతులు కల్పించడం లేదు: ఎమ్మెల్సీ కవిత Fri, Mar 29, 2024, 09:55 AM
కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం: కేటీఆర్ Fri, Mar 29, 2024, 09:42 AM