ఉద్యోగులకు 'ఈపీఎఫ్ఓ' శుభవార్త

byసూర్య | Fri, Jan 24, 2020, 08:05 PM

ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO శుభవార్త చెప్పింది. ఉద్యోగులు జాబ్ మారిన తర్వాత తమ ఎగ్జిట్ డేట్‌ ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసే అవకాశాన్ని ఈపీఎఫ్ సబ్ స్క్రైబర్లకు కల్పిస్తూ 'డేట్ ఆఫ్ ఎగ్జిట్' సదుపాయాన్ని ప్రారంభించింది ఈపీఎఫ్ఓ. దీంతో ఈపీఎఫ్ ఖాతాదారులే 'డేట్ ఆఫ్ ఎగ్జిట్'ను ఆన్‌లైన్‌లో సులువుగా అప్‌డేట్ చేయొచ్చు. దానికి సంబంధించిన ప్రాసెస్ ఇలా....


మీరు మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో 'డేట్ ఆఫ్ ఎగ్జిట్' ఎంటర్ చేయాలంటే ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ unifiedportal-mem.epfindia.gov.in/ ఓపెన్ చేయండి.మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.


Manage సెక్షన్‌లో Mark Exit పైన క్లిక్ చేయండి.


మీ పీఎఫ్ అకౌంట్‌ నెంబర్‌ను ఎంచుకోండి.


డ్రాప్‌డౌన్ మెనూలో select employment పైన క్లిక్ చేయండి.


ఆ తర్వాత ఎగ్జిట్ తేదీ, కారణం వెల్లడించండి.


Request OTP పైన క్లిక్ చేస్తే ఆధార్‌తో లింకైన మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.


ఓటీపీ ఎంటర్ చేసి అప్‌డేట్ పైన ఆ తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి.


'డేట్ ఆఫ్ ఎగ్జిట్' అప్‌డేట్ అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది.


డేట్ ఆఫ్ ఎగ్జిట్ వెల్లడించడం ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లకు అవసరం. లేకపోతే క్లెయిమ్ సబ్మిషన్, సెటిల్మెంట్లలో ఇబ్బందులు వస్తాయి.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM