పుర పోరులో.. కారు జోరుకు ప్రతిపక్షాలు బోల్తా

byసూర్య | Fri, Jan 24, 2020, 07:51 PM

తెలంగాణలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ దూసుకుపోతుంది. మెజార్జీ స్థానాలను కారు గుర్తు కైవసం చేసుకోనున్నది. కారుకు పట్టే పగ్గాలు లేవని మరోసారి తేలనున్నది. ఈ మేరకు హైదరాబాద్‌ కేం‍ద్రంగా పనిచేస్తున్న పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్‌ సర్వే తన నివేదికను విడుదల చేసింది. ఈ సంస్థ కార్పొరేషన్, మున్సిపల్ పోల్స్ లో ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి 20 శాతం మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్ల పరిధిలో ప్రీ పోల్‌ సర్వేను చేపట్టింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో మెజార్టీ సీట్లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనున్నట్లు ఆ సంస్థ తమ సర్వేలో పేర్కొన్నది. ఈ సర్వేల్లో కార్పొరేషన్లల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ డివిజన్లను కైవసం చేసుకోనున్నట్లు వెల్లడించింది. గతంలో ఎన్నడు లేని విధంగా బీజేపీ పార్టీ అనూహ్యంగా పుంజుకోనున్నట్లు పేర్కొన్నది.


కార్పొరేషన్లల్లో ఓటింగులో కూడా టీఆర్ఎస్ పార్టీ 49.1శాతం ఓటింగును పొందనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీని తర్వాత బీజేపీ 23.8 శాతం, కాంగ్రెస్ 21శాతం ఓట్లను పొందనున్నాయి. మున్సిపాలిటీల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రెండోస్థానంతో సరిపెట్టుకోనున్నది. ఓటింగు 23.3శాతం ఓట్ల సాధించనున్నది. టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 52.3శాతం ఓట్లను పొందనున్నది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి 50శాతానికి పైగా ఓటు బ్యాంకు వచ్చింది. దీన్నిబట్టి టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని చెప్పవచ్చు. అదే విధంగా బీజేపీ మున్సిపాలిటీలో మూడో స్థానంతో సరిపెట్టుకోనున్నది. ఆ పార్టీకి కార్పొరేషన్లతో పోల్చితే ఓటు బ్యాంకు 5శాతం తేడా ఉంది. వీటిలో 16.1శాతం ఓట్లు రానున్నట్లు సర్వేల్లో పేర్కొన్నది. దీంతో మున్సిపాలిటీల్లో సీట్ల విషయంలోనూ కాంగ్రెస్ కు బీజేపీకి చాలా తేడా ఉండే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం కూడా ఆ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో మెరుగైన స్థానాలను కైవసం చేసుకోనున్నది. అంతేకాకుండా తమ ఓటు బ్యాంకు పదిలం చేసుకోవడంతో పాటు 3.3శాతం ఓటింగును సాధించనున్నది. ఎంఐఎం గతంతో పోల్చితే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. మిగతా టీడీపీ, వామపక్ష పార్టీలు, తెలంగాణ జనసమితి వంటి పార్టీలు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదని తేలింది. అయా పార్టీలు పోటీ చేసిన స్థానాలు చాలా తక్కువగా ఉండడంతో ఓటర్లపై పెద్దగా ప్రభావం పడలేదని తేలింది.


కార్పొరేషన్లల్లో టీఆర్ఎస్ పార్టీకి 180 నుంచి 200, బీజేపీకి 65 నుంచి 80, కాంగ్రెస్ కు 40 నుంచి 60, ఎంఐఎం కు 8 నుంచి 10 డివిజన్లను దక్కించుకోనున్నట్లు సంస్థ తమ సర్వేల్లో పేర్కొన్నది. అదే విధంగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ కు 1990 నుంచి 2000ల వార్డులు, కాంగ్రెస్ కు 375 నుంచి 415, బీజేపీకి 150 నుంచి 180, ఎంఐఎంకు 20 నుంచి 30 వార్డులను కైవసం చేసుకోనున్నట్లు వెల్లడించింది. మిగతా టీడీపీ, తెలంగాణ జనసమితి పార్టీలు అక్కడక్కడా 10లోపు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పోలింగులో 70.26 శాతం నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.


Latest News
 

వెండి కిరీటాలు బహుకరణ Tue, Apr 16, 2024, 11:14 AM
టూరిజం కోర్సులకు దరఖాస్తులు Tue, Apr 16, 2024, 10:46 AM
నేడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి Tue, Apr 16, 2024, 10:44 AM
మనస్తాపంతో బీఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య Tue, Apr 16, 2024, 10:42 AM
రేపు వ్యవసాయ మార్కెట్ కు సెలవు.. ఎందుకంటే! Tue, Apr 16, 2024, 10:39 AM