సుఖ:వంతమైన నిద్రను అందించే గృహ నివారణలు

byసూర్య | Fri, Jan 17, 2020, 07:56 PM

నిద్రలేమి లేదా "ఇన్సొమ్నియా" అనేది రాత్రి సమయంలో నిద్ర రాకపోవటం అని అర్థం. నిపుణులు ప్రకారం, ఆరోగ్యంగా ఉండటానికి రోజు రాత్రి కనీసం 6 నుండి 8 గంటల పాటు నిద్ర అవసరం అంటున్నారు కానీ, ఈ సమయం పాటూ నిద్రపోవటం కొంత మందికి వీలుపడదు. వీరిలో నిద్రాభంగం లేదా నిద్ర రాకపోవటం లేదా మధ్య మధ్యలో లేవటం వంటి వాటిని గమనించవచ్చు. కొన్ని పద్దతులను ఇంట్లోనే పాటించటం వలన ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ పద్దతుల గురించి కింద చర్చించబడింది.


క్రమంగా వ్యాయామాలు


అన్ని రకాల సమస్యలకు చికిత్సగా వ్యాయామాలను తెలుపవచ్చు. కానీ, కొన్ని వ్యాయామాల వలన నిద్రాభంగం కూడా కలగవచ్చు. మంచి ఉపాయం ఏమిటంటే, పడుకోటానికి ముందుగా, వ్యాయామాలను చేయటం వలన శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చెందటం వలన విశ్రాంతి తీసుకోవాలనే భావన మీలో కలిగి ప్రశాంతమైన నిద్రను పొందుతారు. అంతేకాకుండా, వ్యాయామాల వలన శరీరంలో లాక్టిక్ ఆసిడ్ ఉత్తేజం చెందటం వలన నిద్రపై సానుకూల ప్రభావాలను చూపుతుంది.


జాగింగ్, స్పీడ్ వాకింగ్, స్విమ్మింగ్ లేదా స్కిప్పింగ్ వంటి ఏ రకమైన వ్యాయామాలను ఎంచుకొని చేయటం వలన హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఈ వ్యాయామాలను చేయటం వలన అలసిపోయి, త్వరగా ప్రశాంతమైన నిద్రను పొందుతారు.


రోజు చేసే కార్యక్రమాలు


మన శరీరం తరువాత కార్యక్రమాలు చైతన్యవంతమైనవా? లేదా అని తెలుసుకోటానికి ఆరాటపడుతుంది. మీరు ఒకరోజు రాత్రి 1 కి నిద్రపోయి మరుసటి రోజు ఉదయం 11 లేసినట్లయితే, తరువాత రోజు కూడా అదే సమయానికి మీ శరీరం నిద్రపోయి, అదే సమయానికి లేవాలని మన శరీరం ఆశిస్తుంది. సమయానికి నిద్రపోవటం మరియు సమయానికి నిద్ర లేవటం వంటి సమయ పాలన వలన నిద్రలేమి వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కానీ ఇలాంటి సమయ పాలనలు అలవాటు అవటానికి రెండు లేదా మూడు రోజుల సమయం పడుతుంది. ఇలా అలవాటు చేసుకున్నట్లయితే, నాణ్యమైన నిద్ర మీ సొంతం అవుతుంది.


యోగాసనాలు


శారీరకంగా మరియు మానసికంగా శరీరాన్ని నిద్రకు అనుకూలంగా చేసే ఉపశమన పద్దతులుగా యోగాసనాలను తెలుపవచ్చు. మానసికంగా మరియు శారీరకంగా స్థిరంగా ఉండటం అవసరం. వీటిలో చాలా రకాల పద్దతులు "ఇన్సొమ్నియా" వ్యాధి గ్రస్తులకు నిద్రలేమి నుండి ఉపశమనం అందించాయి మరియు బెడ్ పైన ఆందోళనలు లేదా విసుగు వంటి కారణాలను కూడా తగ్గించాయి.


శిరాసన, పశ్చిమోత్తాసన, ఉత్తనాసన, విపరితకర్ని మరియు శవాసన వంటి యోగాసనాలు శక్తివంతమైనవి. కానీ వీటిలో మీకు ఏది సరైనదో నిపుణులతో చర్చించి ఎంచుకోండి.


ఔషదాలు


చాలా మంది నిద్రపోవటానికి ముందు ఇంట్లో తయారు చేసుకున్న ఔషదాలను వాడతారు. పిప్పలి వేరు ను గ్రైండ్ చేసే పొడిగా  చేస్తారు. ఒక చెంచా పిప్పలి పొడి, బెల్లంను తీసుకొని ఒక గ్లాసు వేడి పాలకు కలుపుతారు. మరొక ఔషదం- పెనంపై వేయించిన జీలకర్ర విత్తనాలను, దంచిన అరటిపండు మరొక ఔషదాన్ని తయారు చేసి, భోజనానికి ముందు నేరుగా తీసుకోవాలి. వేడిగా ఉండే పాలలో ఒక చెంచా తేనె కలిపి తాగటం వలన కూడా నిద్రలేమి వంటి సమస్యలను నుండి ఉపశమనం పొందవచ్చని మరికొంత మంది తెలుపుతున్నారు.


ఇలా తయారుచేసిన ఔషదాలను ఒకసారి వాడి చూడండి. ఒకసారి వాడితే, అవి ఏ విధంగా పని చేస్తాయి? అసలు పని చేస్తాయా లేదా అనే విషయం మీకే తెలుస్తుంది. పైన తెలిపిన ఔషదాలను వాడటం వలన ఎవైన సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుడిని కలవండి.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM