తెలంగాణకు కేంద్రం గుండు సున్నా చూపించింది: మంత్రి కేటీఆర్

byసూర్య | Fri, Jan 17, 2020, 07:39 PM

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదని గుండు సున్నా చూపించిందని చేసింది గుండు సున్నా చూపించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ విలేకరులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. దేశంలో ఎన్ని పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మార్చారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పాలని, ఏ అమృత్ పట్టణంలో అమృతం పారుతుందో చూపాలని సవాల్ విసిరారు. పట్టణాలకు నిధులిచ్చామంటూ అసత్యాలను బిజెపి ప్రచారం చేస్తున్నదని, రాష్ట్రానికి చట్టప్రకారం దక్కాల్సిన నిధులకన్నా, ఇతర రాష్ట్రాల కంటే ఒక్క రూపాయి అదనంగా ఇస్తున్నారా అని ప్రశ్నించారు.


దబ్దాలుగా ప్రజలకు ఏం చేయలేని కాంగ్రెస్, బిజెపిలపైన ప్రజలే చార్జీషీట్ వేస్తారని, ఆ పార్టీలకు చార్జీషీట్ చేసే హక్కులేదనిఐదేళ్ల తమ పాలనపైన చార్జీషీట్ అంటే మరి 60 ఏళ్ల అసమర్ధ పాలనపైన ఎన్ని చార్జీషీట్లు వేయాలని ప్రశ్నించారు. ప్రచారం కోసం, పత్రికల కోసం ప్రతిపక్షాలు ప్రకటనలు చేస్తున్నాయని, ఆ పార్టీలు ప్రజాక్షేత్రంలో మాత్రం ఉండడం లేదన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న మంచి కార్యక్రమాలను చూడలేని పరిస్ధితిలో ప్రతిపక్షాలున్నాయని ఎద్దేవా చేశారు.


కాంగ్రెస్, బిజెపికి అభ్యర్థులు కరువయ్యారని, టీఆర్ఎస్ పార్టీ రెబెల్ అభ్యర్ధులకు ప్రచారం చేసే దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఇక్కడ అనైతికంగా లోపాయికారీ పొత్తులు పెట్టుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటిచిన విజన్ డాక్యూమెంట్ ఒక డొల్లా పత్రమని ఎద్దేవా చేశారు. తాము అమలు చేస్తున్న కార్యక్రమాలను హమీలుగా పేర్కొనడం వారికున్న సీరియస్ నెస్ కు అద్దం పడుతుందన్నారు. అధికారంలోకి వస్తే హమీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవన్న సోయి లేదని విమర్శించారు. వాళ్లు ఎప్పుడు అధికారంలోకి వస్తారని, ఎప్పుడు అమలు చేస్తారో పట్టణ ప్రజలకు ముందు స్ఫష్టం చేయాలన్నారు. ప్రజలను మోసం చేసేందుకే కాంగ్రెస్ విజన్ డాక్యూమెంట్ పేరిట ప్రచారం చేస్తున్నదని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా తమ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


దశాబ్దాలుగా అధికారంలో ఉండి పట్టణాలకు ఏమాత్రం అభివృద్ది చేయలేనందుకు కాంగ్రెస్, బిజెపిలపైన ప్రజలు చార్జీషీట్ వేస్తారని అన్నారు. అయిదేళ్లలో గత చరిత్రలో ఎన్నడు లేనంత అభివృద్ది చేసిన తమపైన చార్జీషీట్ అంటూ బిజెపి చేసిన ప్రకటనపైన అయన మండిపడ్డారు. కేవలం ప్రచారం కోసం ప్రకటనలు కాకుండా ఎన్నికల బరిలో పూర్తి స్ధాయిలో అభ్యర్ధులు నిలపలేని తమ పార్టీ బలహీనత, తక్కువగా ఉన్న బలగంపైన దృష్టి సారించాలని బిజెపి అద్యక్షుడు లక్మణ్ కు సూచించారు. వీలైతే ఎన్నికల్లో పోటీపైన దృష్టిసారించాలన్నారు. 2014 నుంచి రాష్ట్రానికి ఏమీ చేయలేని బిజెపిపైనే చార్జీషీట్ వేయాలన్నారు. బిజెపి చెప్పిన స్మార్ట్ సిటీలు, అమృత్ కార్యక్రమంపైన చురకలు అంటించారు. దేశంలో ఎన్ని పట్టణాలను స్మార్ట్ సిటీలుగా ఎన్ని మార్చారో లక్ష్మణ్ చెప్పాలని, ఏ అమృత్ పట్టణంలో అమృతం పారుతుందో చూపాలన్నారు. ఎక్కడైన స్మార్ట్ సిటీని నిర్మిస్తే ప్రజలకు చూపించాలన్నారు. కాంగ్రెస్, బిజెపి నేతలు ఎంత గింజుకున్నా కేసీఆర్ పై ప్రజలకు అపార నమ్మకం వున్నదని, ఈ నమ్మకం ప్రతి ఎన్నికల్లోనూ తేలుతూవస్తుందన్నారు. కాంగ్రెస్, బిజెపికి అభ్యర్థులు కరువయ్యారని, టిఆర్ఎస్ రెబెల్ అభ్యర్ధులకు ప్రచారం చేసే దుస్థితిలో ఉన్నాయన్నారు. జాతీయ పార్టీలమంటూ ప్రజల ముందు డ్రామాలు చేసే కాంగ్రెస్, బిజెపి పార్టీల ఇక్కడ అనైతికంగా లోపాయికారీ పొత్తులు పెట్టుకున్నాయన్నారు. అయినా ప్రజలు కాంగ్రెస్, బిజెపిలకు బి ఫామ్ ఇస్తాం, ఎన్నికల ఖర్చులకు డబ్బులిస్తామన్నా ప్రజలు తీసుకోవటం లేదన్నారు. పట్టణాలకు నిధులిచ్చామంటూ అసత్యాలను బిజెపి ప్రచారం చేస్తున్నదన్నారు.


గత అయిదున్నర సంవత్సరాలుగా తమ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను చూడలేని పరిస్ధితిలో ప్రతిపక్షాలున్నాయని తెలిపారు. దశాబ్దాలుగా అధికారంలో ఉండి పట్టణాలకు ఏం చేశారో ప్రతిపక్షాలు ప్రజలకు వివరించాలన్నారు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం ప్రచారంలో చేయాలో కూడా తెలియని పరిస్ధితిలో ఉన్నదని, పట్టణాలకు ఏం చేస్తారో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాదిరి, అంత ఖర్చుతో దేశంలోని ఏ బిజేపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా కట్టారా అంటూ తెలంగాణ అభివృద్దిపైన మాట్టాడి కేంద్ర మంత్రి, బిజెపి నాయకుడు కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఒకవేళ కిషన్ రెడ్డికి సమచారం లేకుండే, ప్రభుత్వం కడుతున్న ఇళ్లను చూసేందుకు కొల్లూరు వస్తే ఎర్ర తివాచీ పరిచి ఇండ్ల నిర్మాణాలు చూపిస్తాన్నారు. పట్టణాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ.18వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నామని తెలిపారు.


కాంగ్రెస్ ప్రకటించిన విజన్ డాక్యూమెంట్ క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులతో సంబంధం లేకుండా హైదరాబాద్ లో కూర్చుండి రూపొందించిన డొల్లా పత్రమన్నారు. అందులో విజన్ ఏమాత్రం లేదన్నారు. ఇప్పటికే తాము అమలు చేస్తున్న 5రూపాయల భోజనం, సింగిల్ విండో అనుమతులు చేస్తామంటూ చెప్పడం హస్యస్పదం అన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న వాటి హమీలుగా ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అర్థమౌతుందన్నారు. అధికారంలో వస్తే హమీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవన్న అవగాహణ కూడా లేదన్నారు. కనీసం మరో నాలుగేళ్లపాటు కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేని పార్టీ హమీల అమలు ఏలా చేస్తారో ఉత్తమ్ కూమార్ రెడ్డి చెప్పాలన్నారు. కేవలం ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు విజన్ డాక్యూమెంట్ తో మోసం చేస్తుందన్నారు. అధికారంలోలేని వారు ఏన్ని అసత్య, అమలుచేయలేని హమీలు ఇవ్వగలుగుతారని, ఎందుకంటే అధికారంలోకి ఎలాగు రాలేమని వారికి తెలుసునని ఎద్దేవా చేశారు.


తాము చేసిన అభివృద్ది అధారంగానే ఓట్లు అడుగుతున్నామని, ప్రజలు తాము చేసిన అభివృద్దిని చూసి మరోసారి ఘన విజయం కట్టబెడతారన్న నమ్మకం తమకున్నదన్నారు. ఎన్నికల సందర్భంగానైనా టికెట్లు దక్కనివారి వలన సహజంగానే అసంతృప్తి వ్యక్తం అవుతుందన్నారు. ఇలాంటి వాన్నింటిని పార్టీ సమన్వయం చేసిందని తెలిపారు. సూమారు 3100 టిక్కెట్లు ఇస్తే ఎన్ని చోట్ల అసంతృప్తి వ్యక్తం అయిందో చూడాన్నారు. ఎన్నికల్లో టికెట్ల కేయింపుపైన వస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, పార్టీ గెలుపుకోసమే ఐక్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని తెలిపారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM