సీఎం కేసీఆర్ బంధువును అంటు పోలీసులపై వ్యక్తి వీరంగం

byసూర్య | Fri, Jan 17, 2020, 06:40 PM

సీఎం కేసీఆర్ పేరుతో ఓ క్యాబ్ డ్రైవర్ నానా హంగామ సృష్టించాడు. తన కారునే ఆపుతారా ఆంటు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన హైదరాబాద్ నేరేడ్ మెట్ చౌరాస్తారో చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. గురువారం నేరేడ్ మెట్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్ 16 యూబి5620 వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఆ క్యాబ్ డ్రైవర్ వద్ద ఎలాంటి పత్రాలు లేవు. దీంతో చలాన్ విధించాలని నిర్ణయించారు పోలీసులు. ఈ సమయంలో సదరు క్యాబ్ డ్రైవర్ రెచ్చిపోయాడు. నేను సీఎం కేసీఆర్ బంధువుని, తాను కేసీఆర్ భార్య శోభా మేనల్లుడిని తన కారు ఆపడమే కాకుండా చలాన్ విధిస్తారా? పదండి ప్రగతి భవన్ కు వెళ్దాం అంటూ పోలీసులపైకి చిందులు వేశాడు. దీంతో అక్కడ కొద్దిసేపు హైడ్రామా నడిచింది. పోలీసులు అతని తండ్రికి ఫోన్ చేస్తే తన కుమారుడు గత కొంత కాలంగా మానసికంగా బాధపడుతున్నాడని చెప్పాడు. దీంతో క్యాబ్ ను సీజ్ చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు పోలీసులు.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి Thu, Apr 25, 2024, 01:06 PM
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి Thu, Apr 25, 2024, 01:04 PM
అలంపూర్ ఆలయాలలో ప్రత్యేక పూజలు Thu, Apr 25, 2024, 12:59 PM