బిజెపి, క్రాంగెస్ లు మాకు పోటీనే కాదు : కెటిఆర్

byసూర్య | Fri, Jan 17, 2020, 06:40 PM

మున్సిపల్‌ ఎన్నికల్లో అన్నిస్థానాలకు పోటీ చేయలేని బిజెపి, కాంగ్రెస్ లు తమ పార్టీకి అసలు పోటీనే కాదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ఎందుకు నిలపలేకపోయిందని  ప్రశ్నించారు.  హైదరాబాద్ లో  మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ,. కాంగ్రెస్‌, బీజేపీ కలసి పనిచేస్తూ పైకి డ్రామాలు అడుతున్నాయని ఆయన మండిపడ్డారు. 25 పట్టణాల్లో కాంగ్రెస్‌, బీజేపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెట్టలేదని ఎద్దేవా చేశారు.. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఐదేళ్లలో కేంద్రం నుంచి అదనపు నిధులు ఏమైనా తెచ్చారా అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. రూ.18 వేల కోట్లతో 2 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.  ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని,  ఉద్యోగులకు మాపై విశ్వాసం ఉందని అన్నారు.. సీఎం కేసీఆర్‌ మనసులో ఇంకా చాలా సంక్షేమ పథకాలున్నాయని అంటూ  ఐదు రూపాయల భోజనాన్ని జానారెడ్డి తిని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు…తమది అభివృద్ధి ప్రభుత్వమని, ప్రజా సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రమని అన్నారు.. కాగా కొత్త మున్సిపల్‌ చట్టాన్ని కఠినంగా అమలుచేస్తామని తేల్చి చెప్పారు.. రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ వెలుగులు తీసుకవచ్చింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని వెల్లడించారు.. రాష్ట్రంలో 90 మినీ ట్యాంక్‌బండ్‌లు ,. హైదరాబాద్‌ చుట్టూ 25 పార్కులు ఏర్పాటు చేశామన్నారు.మున్సిపల్‌ మంత్రిగా ఈ ఎన్నికలు నాకు సవాలు వంటిదనేనని అంటూ  జీహెచ్‌ంఎసీ ఎన్నికలు సమయానికి జరుగుతాయన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM