తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం: హోంశాఖ మంత్రి

byసూర్య | Fri, Jan 17, 2020, 04:50 PM

కానిస్టేబుల్‌ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. పీజీ చదివిన వాళ్లు కానిస్టేబుల్‌గా రావడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని మహమూద్‌ అలీ అన్నారు. ఇప్పటివరకు విదేశీ పోలీసులను ఆదర్శంగా చూపించేవాళ్లం. కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ పోలీస్‌ శాఖకు మరింత ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పోలీస్‌ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్ర పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.


సీఎం మార్గదర్శకత్వంలో శాంతిభద్రతలు పరిరక్షించడంలో పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారని.. సీపీ అంజనీ కుమార్‌ అన్నారు. 100 డయల్‌, పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌, టెక్నాలజీ పోలీస్‌ సేవలు.. ఇలా అన్ని విధాలుగా తెలంగాణ దేశంలోనే నెంబర్‌1 స్థాయిలో ఉందన్నారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 267 మంది కానిస్టేబుళ్ల శిక్షణ అభ్యర్థులకు 9 నెలల పాటు ట్రైనింగ్‌ ఉంటుంది.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM