జాతీయ రహదారులపై వాహనాల రద్దీ

byసూర్య | Fri, Jan 17, 2020, 02:05 PM

సంక్రాంతి పండగ సెలవులు ముగించుకుని సొంతూళ్లకు వెళ్లిన వారు పట్నం బాట పట్టారు. దీంతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్ వెళ్లే వైపు దారుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నాన్ ఫాస్టాగ్‌ వాహనాలకు రెండు క్యాష్ కౌంటర్ గేట్ల ద్వారా అనుమతి ఇస్తున్నారు. నాన్ క్యాష్ కౌంటర్ దారుల్లో వాహనాలు బారులు తీరగా, ఫాస్టాగ్‌ దారుల్లో రద్దీ సాధారణంగా ఉంది. ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి, రాకపోకలను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజాల దగ్గర వాహనాలకు ఫాస్టాగ్‌లను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM