బిర్యానీలో ఇనుపతీగలు.. క్షమాపణలు చెప్పిన జోమాటో

byసూర్య | Fri, Jan 17, 2020, 01:17 PM

బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. ఫ్రెండ్స్, ఫ్యామీలీతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్తే ముందుగా బిర్యానీనే ఆర్డర్ ఇస్తాం. ఇప్పుడు, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ సర్వీసులు రావడంతో బిర్యానీ డిమాండ్ ఇంకాస్తా పెరిగింది. అయితే, బిర్యానీ ఆర్డర్ వచ్చింది కదా అని ఆవురావురమంటూ తినేయకండి. ఎందుకంటే వాటిలో ఏమైనా ఉండోచ్చు. తాజాగా కూకట్ పల్లికి చెందిన ఓ యువకుడు ఆర్డర్ ఇచ్చిన బిర్యానీలో ఇనుప తీగలు దర్శనమిచ్చాయి. వివరాల్లోకి వెళ్లితే..


హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన శ్రీనివాస్ జోమాటో నుంచి బిర్యానీ, కర్డ్ రైస్ ఆర్డరు చేశాడు. శ్రీనివాస్ ముందుగా బిర్యానీ తినడం ప్రారంభించారు. బిర్యానీ తింటుండగా నోట్లో పంటి కింద గట్టిగా తగిలింది. ఇదేమిటని వేలితో బయటకు తీయగా ఇనుపతీగ దర్శనమిచ్చింది. దీనిపై జోమాటో టీంకు శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా వారు అతనికి క్షమాపణలు చెప్పి, డిస్కౌంట్ కూపన్ ఇచ్చారు. అనంతరం శ్రీనివాస్ జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ట్విట్టర్‌లో బిర్యానీ విక్రయించిన రెస్టారెంట్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కూకట్‌పల్లిలోని రాజావారి రుచులు రెస్టారెంట్‌‌లో తనిఖీలు చేసి రూ.5 వేలు జరిమానా విధించారు. బిర్యానీలో ఇనుపతీగ వచ్చిన ఘటనపై తాను వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని శ్రీనివాస్ చెప్పారు. కాగా దీనిపై తాము తగిన చర్యలు తీసుకుంటామని జోమాటో పేర్కొంది.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM