తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. కొత్త మున్సిపల్ చట్టం

byసూర్య | Fri, Jan 17, 2020, 12:21 PM

ఇల్లు కట్టేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెల్పింది. ఇళ్ల నిర్మాణ అనుమతులకు ఇబ్బందులను తొలిగిస్తూ కొత్త మున్సిపల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారా ఇంటి అనుమతులు ఇకపై సులభంగా మంజూరు కానున్నాయి. 75 గజాల్లోపు స్థలంలో జీ+1 ఇంటి నిర్మాణానికి అనుమతులు అక్కర్లేదు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించి కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే ఇల్లు నిర్మించుకునే సదుపాయం. ఇల్లు కట్టిన తర్వాత మున్పిపాలిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడ పొందాల్సిన అవసరం లేదు.


ఇకపై తెలంగాణలో ఇళ్ల నిర్మాణాలకు కొత్త అనుమతులు ఇలా...


- 75 గజాల్లోపు స్థలంలో జీ+1 ఇంటి నిర్మాణానికి నో పర్మిషన్. ఒక్క రూపాయితో ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పిస్తే చాలు. మునిసిపాలిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడ అవసరం లేదు.


- 64 చదరపు అడుగుల నుంచి 500 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో పది మీటర్ల ఎత్తున ఇల్లు నిర్మించుకోవాలంటే ఆన్‌లైన్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పిస్తే అనుమతులు మంజూరు.


- 200 చదరపు అడుగుల లోపు లేదా 7 మీటర్ల లోపు భవనాలను కట్టుకునే వారు 10 శాతం బిల్డప్ ఏరియాను తనఖా పెట్టాల్సిన అవసరం లేదు.


- 500 చదరపు అడుగులు.. అంత కంటే ఎక్కువ.. 10 మీటర్లు లేదా అధిక ఎత్తులో ఇళ్ల నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతి.


- తప్పుడు వివరాలు నమోదు చేస్తే నోటీసులు ఇవ్వకుండానే ఇల్లు కూల్చివేత.


- నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మిస్తే మూడేళ్ల జైలు.. భారీ జరిమానా.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM