టిఆర్ఎస్ లో చిచ్చు పెట్టిన మున్సిపల్ ప్రచారం

byసూర్య | Thu, Jan 16, 2020, 08:02 PM

మున్సిపల్ ఎన్నికలు టిఆర్ఎస్ లో చిచ్చుపెట్టాయి. కొన్నిరోజుల ముందు వరకూ కలసి కట్టుగా ఉన్న పార్టీ నాయకులు మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని ముక్కలైపోయారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్‌ను బుజ్జగించి బరి నుంచి తప్పించాలని భావిస్తున్న టీఆర్ఎస్‌కు ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఊహించని షాక్ ఇచ్చారు. తన నియోజకవర్గంలోని కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 20 మంది స్వతంత్ర అభ్యర్థులకు ఆయన మద్దతు ప్రకటించారు. అంతేకాదు వారిని గెలిపించాలని ప్రచారం చేయడంతో టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో అక్కడ టీఆర్ఎస్ తరపున అభ్యర్థుల ఎంపిక, వారికి బీఫామ్‌లు ఇచ్చే బాధ్యతను కేసీఆర్ ఆయనకే అప్పగించారు. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జూపల్లి కృష్ణారావు తన వర్గం వారిని కొల్లాపూర్‌లోని మొత్తం 20 వార్డుల్లో పోటీ పెట్టారు. వారందరినీ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున సింహం గుర్తుపై పోటీకి నిలబెట్టిన జూపల్లి కృష్ణారావు పట్టణంలో సింహం గుర్తుతో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. జూపల్లి తీరుపై ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఇతర గుర్తుపై ప్రచారం చేసే విషయాన్ని హర్షవర్ధన్ రెడ్డి కేటీఆర్‌కు కూడా చెప్పారు. అయితే రెబల్స్‌ను బరి నుంచి తప్పించాలని మంత్రి కేటీఆర్ జూపల్లిని కోరారు. ఆ తర్వాత నామినేషన్లు విత్ డ్రా సమయానికి వారితో విత్ డ్రా చేయిస్తానని జూపల్లి చెప్పడం విశేషం. జూపల్లి కృష్ణారావు విషయంలో ఆ పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం పార్టీ వర్గాలతో పాటు జిల్లా రాజకీయాల్లోనే ఆసక్తిని రేపుతోంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM