రెండోస్థానంలో నిలిచిన టిక్ టాక్

byసూర్య | Thu, Jan 16, 2020, 07:49 PM

టిక్ టాక్ యాప్ అంటే ప్రస్తుతం తెలియని వారు ఉండరు. ఈ చైనీస్ సోషల్ మీడియా యాప్ ఎంత వేగంగా ప్రజాదరణ పొందిందో మనందరీకి తెలిసిందే. సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు టిక్ టాక్ ఫేవరెట్ యాప్‌గా మారింది. ఈ సోషల్ మీడియా యాప్ తాజాగా ఫేస్ బుక్ మెసెంజర్‌ను వెనక్కినెట్టింది. సెన్సర్ టవర్ అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ 700 మిలియన్ల డౌన్ లోడ్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు రెండోస్థానంలో ఉన్న ఫేస్ బుక్ మెసెంజర్... టిక్ టాక్ ప్రభంజనంతో డీలాపడింది. కాగా, ఈ జాబితాలో ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ అగ్రస్థానంలో ఉంది. వాట్సాప్ 850 మిలియన్ డౌన్ లోడ్లతో నెంబర్ వన్ గా కొనసాగుతోంది.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM