గెస్ట్ హౌస్‌లో వ్యభిచారం ..

byసూర్య | Thu, Jan 16, 2020, 01:37 PM

హర్యానాలోని జింద్ జిల్లాలో గుట్టుగా సాగుతున్న సెక్స్‌రాకెట్‌ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఖన్సర్ చౌక్ సమీపంలోని గెస్ట్ హౌస్‌లో కొన్నా్ళ్లుగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. మంగళవారం హఠాత్తుగా అక్కడ రైడ్ చేయగా రెండు జంటలు నగ్నంగా దొరికాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.


ఖన్సర్ చౌక్‌లోని గెస్ట్‌హౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి సెక్స్ దందా నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలడంతో పోలీసులు పక్కా ప్లాన్ వేశారు. ఓ వ్యక్తిని కస్టమర్‌గా క్రియేట్ చేసి నిర్వాహకులతో మాట్లాడించారు. వారు చెప్పిన ప్రకారం శనివారం అతడు గెస్ట్‌హౌస్‌కు వెళ్లగా.. కాసేపటికే పోలీసులు అక్కడ రైడ్ చేశారు.ఈ సందర్భంగా ఇద్దరు సెక్స్‌వర్కర్లు, ఇద్దరు విటులతో పాటు ఓ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలను పానిపట్‌ ప్రాంతం నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


 


 


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM