హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర

byసూర్య | Thu, Jan 16, 2020, 12:05 PM

పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు తీపికబురు. బంగారం ధర తగ్గుతూ వస్తోంది. కొత్త ఏడాది ఆరంభం నుంచే దూకుడు చూపించిన పసిడి ఇప్పుడు కొంత శాంతించింది. బంగారం ధర వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వచ్చింది. పసిడి కొనాలని భావించే వారికి ఇది తీపికబురు.


ధర పైపైకి.. దీంతో ఎఫెక్ట్


బంగారం ధర ఇప్పుడు తగ్గడానికి ధరల పెరుగుదల కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో పసిడి ధర పరుగులు పెట్టింది. కొత్త గరిష్ట స్థాయిలకు చేరింది. దీంతో కొనుగోలుదారులు జువెలరీ షాపులకు రావడం తగ్గించేశారు. పసిడి కొనుగోలుకు దూరంగా ఉండిపోయారు. దీంతో ధరపై ఎఫెక్ట్ పడింది.


హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రెండు రోజుల్లో భారీగా పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర గత రెండు రోజుల్లో ఏకంగా రూ.570 పడిపోయింది. దీంతో పసిడి ధర రూ.37,640కు దిగొచ్చింది.


Latest News
 

ఏడుగురు పేకాట రాయళ్ల అరెస్ట్ Tue, Apr 23, 2024, 12:10 PM
ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు Tue, Apr 23, 2024, 12:04 PM
కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు Tue, Apr 23, 2024, 11:55 AM
పిట్లంలో హనుమాన్ జయంతి వేడుకలు Tue, Apr 23, 2024, 11:54 AM
స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం Tue, Apr 23, 2024, 11:52 AM