మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీకి తలనొప్పి

byసూర్య | Tue, Jan 14, 2020, 08:01 PM

రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ రోజు మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఇదే రోజు తమ పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులకు బీ ఫారమ్స్ ఇచ్చేందుకు గడువు కూడా పూర్తయింది. రెబల్స్ గా నామినేషన్లు వేసిన వారికి బీ ఫారమ్స్ అందకపోవడంతో చాలా మంది తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 10 మంది వరకూ ఆత్యహత్య యత్నానికి పాల్పడ్డారు. మేడ్చేల్ లో బీ ఫారమ్స్ అందకపోవడంతో ఉరి వేసుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన స్థానికులు ఆయన్ను కాపాడి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. సూర్యాపేట, జగిత్యాల, జనగాం మున్సిపాలిటీల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్ లో చంద్రకళ బోరుమని ఏడ్చింది. ఈ లోగా కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్స్ తీసుకొని బరిలో ఉంది. ఆదిలాబాద్ లో మాజీ మున్సిపల్ ఛైర్మన్ మనిషా కంటతడి పెట్టింది. ఇన్నాళ్లు పార్టీకి కష్టపడి పనిచేస్తే ఈ విధంగా చేస్తారా మండిపడింది. మక్తల్ మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే చిట్టేం రామ్మోహన్ రెడ్డి తీరును తప్పుపడుతూ నర్సింహారెడ్డి అనే సీనియర్ కార్యకర్త వంద మంది అనుచరులతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ప్రతి మున్సిపాలిటీల్లో రెబల్స్ తమకు తోచిన రీతిలో ప్రవర్తించారు. చాలా మంది ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ మింగుడు పడడం లేదు.


మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రెండుసార్లు సమావేశం నిర్వహించి మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశా నిర్ధేశం చేశారు. రెబల్స్ లేకుండా ఏదో రకంగా బుజ్జగించాలని తెలిపారు. మున్సిపాలిటీలు కోల్పోతే అయా మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడుతానని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అయినప్పటికీ రెబల్స్ తగ్గలేదని తెలిసింది. ప్రతి నియోజకవర్గంలో బీటీ, యూటీ బ్యాచ్ లుండడంతో ఈ తలనొప్పులు వచ్చాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పాత, కొత్త వారి మధ్య సమన్వయం లేకపోవడంతో రెబల్స్ గా బరిలో ఉంటున్నారని తెలిసింది. దీనిపై ముందునుంచే పార్టీ అధిష్ఠానం దృష్టి కేంద్రీకరిస్తే మెరుగుపడేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నామినేషన్ల పర్వం ముగియడంతో రేపటి నుంచి ఎన్నికల ప్రచార బరిలో బిజీగా గడపనున్నట్లు తెలుస్తున్నది.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM