కేసీఆర్, జగన్ ల రహస్య భేటీ ఎందుకు : పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల

byసూర్య | Tue, Jan 14, 2020, 07:40 PM

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డిల రహస్య భేటీ ఎందుకని పీసీసీ మాజీ చీఫ్ పాన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రగతి భవన్ లో ఆరు గంటలకు పైగా ఏకాంత చర్చలు చేయడంలో పారదర్శకత ఎక్కడ ఉందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా మూడేళ్ల నుంచి అత్యధికంగా నీటిని రాయలసీమ కు తరలిస్తున్నారని తెలిపారు.


కృష్ణ బేసిన్ అవసరాలు, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల చట్ట బద్ధమైన, న్యాయమైన వాటా నీటిని పొందకుండానే నీటిని తరలిస్తుంటే కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఇప్పుడు పోతిరెడ్డి పాడు హెడ్ రేగులేటర్ నుంచి 44 వేల కూసెక్ ల నుంచి 88 వేల కూసెక్ ల సామర్థ్యం పెంచితే ఇంకా నీటిని ఎక్కువ తరలిస్తే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని, ఈ విషయంలో లెక్కలతో సహా చర్చకు వస్తారా నేను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.


ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో అధికారులు లేకుండా ఇద్దరు ముజ్యమంత్రులు చర్చలు చేయడం వెనుక అంతర్యం ఏమిటని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


తెలంగాణ లో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైస్సార్ అభిమానులు తమవైపు వచ్చే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఆడిన దొంగ నాటకమని ఆరోపించారు.


వైఎస్సార్ మరణం తర్వాత కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు మరిచిపోవద్దని గుర్తు చేశారు.


ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఉన్న మునిసిపాలిటీల్లో కొద్దో, గొప్పో ఓట్లు వస్తాయని కేసీఆర్ ఆశ పడుతూ జగన్ తో భేటీ అయ్యారని మండిపడ్డారు.


కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం గురించే మాట్లాడితే నీటిపారుదల కార్యదర్శులు ఎందుకు సమావేశంలో లేరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ముగూడెం సాగర్ టైల్ పాండ్ ఏర్పాటుకు ప్రతిపాదన చేసి పనులు ప్రారంభిస్తే అప్పుడు కేసీఆర్ నానా హంగామా చేశారని తెలిపారు.


ఇప్పుడు గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తే తప్పేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట ఇదేనా కేసీఆర్ నీతియని అన్నారు. పోతిరెడ్డి పాడు నుంచి కృష్ణా వరద జలాలు తరలించే పోతిరెడ్డిపాడు పైన ఇదే రకంగా మాట్లాడారని తెలిపారు.


అప్పుడు కృష్ణ బేసిన్ అవసరాలు తీరాకే పోతిరెడ్డి పాడు నుంచి నీటిని తరలించేందుకు హెడ్ రేగులేటర్ ను 11 వేల కూసెక్ ల నుంచి 44 వేలకు పెంచితే నీటిని ఆంధ్ర, రాయలసీమ కు దోచి పెడుతున్నారని మాట్లాడిన కేసీఆర్ ఇప్పడు 88 వేల కుసేక్లు తరలిస్తామని ఆ సిం అంటుంటే ఎందుకు నోరు మెదపడం లేదు. ఇదంతా కుట్ర కాదా.. తెలంగాణ అవసరాలు అన్ని తీరినాక నీటిని తరలించాలని అప్పుడు అన్న కేసీఆర్ ఇప్పుడు మాట్లాడక పోవడానికి కారణం ఏమిటని విమర్శించారు.


Latest News
 

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM