ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించిన రెబల్స్

byసూర్య | Tue, Jan 14, 2020, 06:33 PM

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబల్స్ చుక్కలు చూపించారు. పలు ప్రాంతాల్లో నేరుగా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగినా రెబల్స్ లొంగలేదు. బుజ్జగింపులకు కొందరు ఆభ్యర్థులు లొంగితే.. మరికొంత మంది రెబల్ అభ్యర్ధులు ససేమిరా అన్నారు. జనగామ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు గంగాభవాని అనే మహిళా చున్నితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇక ఆదిలాబాద్ మాజీ చైర్మన్ మనిషా కంటతడి పెట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న తన కుమారుడిని చైర్మన్ ను చేసేందుకు తనకు అన్యాయం చేశారని మనిషా ఆరోపించారు.


మేడ్చల్ లో బీ ఫారం కోసం విజయ్ అనే వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల ప్రధాన పార్టీలకు ఇవే షాకులు తగిలాయి. పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు కాకుండా వేరే వాళ్లకు టికెట్లు ఇచ్చారని పలువురు రెబల్స్ ఆరోపణలు చేశారు. నామినేషన్ల విత్ డ్రా గడువు ముగియడంతో 3 వేల 52 వార్డులకు 19 వేల 673 మంది ఆభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఈసీ పేర్కోంది. ఈ నెల 22 న 120 మున్సిపాలిటీలు 9 కార్పోరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.


Latest News
 

సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM
దంచికొడుతున్న ఎండలు..ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 07:35 PM