ఎవరికైనా లిఫ్ట్ ఇస్తున్నారా..? అయితే జరిమానా చెల్లించాల్సిందే

byసూర్య | Tue, Jan 14, 2020, 05:19 PM

మీరు బైక్ పై వెళ్తుంటే ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఇస్తున్నారా..? అయితే కాస్త ఆలోచించండి. ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేస్తే తప్పేంటి అనుకుంటున్నారా..? మీరు లిఫ్ట్ ఇస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటారా..? గ్రేటర్ పరిధిలో పోలీసులు తెచ్చిన రూల్ అలాగే ఉంది. ఇప్పటి వరకు డ్రైవింగ్ చేసే వ్యక్తి మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటే సరిపోయేది కానీ.. వెనక కూర్చున్న వ్యక్తి కూడ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. ఇటీవల జరుగుతన్న ప్రమాదాల్లో డ్రైవింగ్ చేసే వారికంటే వెనక కూర్చున్న వారి మరణాల సంఖ్యే అధికంగా ఉంది. దీంతో హైదరాబాద్ పోలీసులు వెనకాల కూర్చున్న వ్యక్తి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే అన్న నిబంధనను తీసుకోచ్చారు.


ఈ నిబంధన మూడు కమీషనరేట్లలో ఈ రోజు నుంచే అమలు చేయాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. అందుకే వాహనదారులు లిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే జరిమానా పడేది వెనక కూర్చున్న వ్యక్తికి కాదు.. వాహన యాజమానికి దీంతో లిఫ్ట్ ఇచ్చేందుకు వాహనదారులు కూడ వెనకడగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే నిబంధనను బెంగళూరులో అమలు చేస్తున్నారు. అయితే భార్యభర్తలు బైక్ పై వెళ్తున్నప్పుుడు వెనక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేదని జరిమానా విధిస్తే ఎలా అని వాహనదారులు వాపోతున్నారు. పోలీసుల వెర్షన్ మాత్రం వేరేలా వుంది. జరిమానాల కోసం ఇద్దరికి హెల్మెట్ తప్పనిసరి చేయడం లేదని.. రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను తగ్గించాలన్నదే తమ ఉద్దేశ్యమంటున్నారు.


Latest News
 

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన Mon, Apr 15, 2024, 10:50 PM
ఆలయంలో అఖండ భజన కార్యక్రమం Mon, Apr 15, 2024, 10:13 PM
అగ్ని ప్రమాదంలో ఆరు ఎకరాల తోట దగ్ధం Mon, Apr 15, 2024, 10:11 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆర్యవైశ్య బచ్చు రామకృష్ణ Mon, Apr 15, 2024, 10:10 PM
అచ్చంపేట పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే Mon, Apr 15, 2024, 10:07 PM