కవిత పొలిటికల్ ఫ్యూచర్ చెప్పిన కేటీఆర్

byసూర్య | Tue, Jan 14, 2020, 04:53 PM

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె కవిత రాజకీయ భవిష్యత్ పై పార్టీ శ్రేణుల్లో ఎన్నో అనుమానాలున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కవిత గెలుపొందారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లో కీ రోల్ పోషించారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనుహ్యాంగా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కు కవిత దూరంగా ఉంటూ వస్తున్నారు. తన ఓటమికి నిజామాబాద్ కు చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే కారణమని కవిత భావించారట. అందుకే రాజకీయాలకు కొద్ది కాలం పాటు దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ గా మారిన మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత కనిపించకపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. తాను ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మంట్లో నాలుగు మున్పిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నా.. కవిత ఎక్కడా కనిపించడం లేదు. అలిగి అమెరికా వెళ్లిపోయిందన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. అది వేరే సంగతి అనుకోండి.. కానీ తన అన్నకు సవాల్ గా మారిన ఎలక్షన్స్ లో చెల్లెలు ఎందుకు దూరంగా ఉన్నారన్నదే ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. తాను ఓటమిపాలై ఏడాది కావొస్తున్నా తనకు పదవి ఇవ్వకపోవడంపై కవిత ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందుకే మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు.


తన సోదరి కవిత రాజకీయ భవిష్యత్ పై కేటీఆర్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు. రానున్న రోజుల్లో కవితకు సముచిత పదవి దక్కనుందని ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు భవిష్యత్ లో కవిత టీఆర్ఎస్ లో కీ రోల్ పోషిస్తుందని అన్నారు. కవిత ఒక యోధుడి కూతురు అని.. ఆమె మళ్లీ ప్రజాక్ష్రేత్రంలో తన సత్తాను చూపుతుందని వ్యాఖ్యనించారు. కేటీఆర్ కామెంట్లతో కవితకు ఎలాంటి పదవి రానుందోనన్న చర్చ నడుస్తోంది. మార్చిలో మూడు రాజ్యసభ పదవులకు ఖాళీలు ఏర్పడనున్నాయి. దీంతో కవితను రాజ్యసభకు పంపుతారని ఎప్పటి నుంచో తెలంగాణ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలతో అదే నిజమైందని కవిత సన్నిహితులు చెబుతున్నారు.


ఏది ఏమైనా కానీ కవిత పోలిటికల్ ఫ్యూచర్ పై వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తన అన్న కేటీఆర్ స్పందించడంతోనైనా కవిత మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుందో లేదో చూడాలి. ఇక మంత్రి హారీష్ రావుతో తనకు విభేదాలున్నాయన్న వార్తలపై కూడా కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. తన బావతో తనకు ఎందుకు విభేదాలు ఉంటాయని ప్రశ్నించారు. ఇద్దరం మంత్రులుగా ఉన్నాం. ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తిస్తుంటే తమ మధ్య విభేదాలు ఎందుకు ఉంటాయని కేటీఆర్ అన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM