రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం ఆకాంక్ష

byసూర్య | Tue, Jan 14, 2020, 03:36 PM

రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం ఆకాంక్ష అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన వేల్పూర్ మండల కేంద్రంలో పల్లె ప్రగతి రెండవ విడతలో భాగంగా మండల పరిధిలోని గ్రామ పంచాయతీల పారిశుధ్యం కొరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎవరు ఎన్నడూ ఆలోచన చేయని విధంగా గ్రామాలు బాగుపడాలి, పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంతో కళకళలాడాలని మన సీఎం కేసీఆర్ కోరుకుంటారన్నారు. ప్రజల ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పల్లె ప్రగతి కార్యక్రమం మొదలుపెట్టారని తెలిపారు. 30 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అధికారులు, యువత, మహిళా కమిటీలు, పార్టీలకు అతీతంగా రాజకీయ వ్యవస్థ సమన్వయంతో బ్రహ్మాండంగా పనిచేశారని మంత్రి అన్నారు. గ్రామాలు మెరుగుపడే దిశగా పయనిస్తున్నాయని మంత్రి తెలిపారు.


ఇంకా మంత్రి మాట్లాడుతూ.. నాకు తెలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం దేశంలోని అన్ని కార్యక్రమాలతో పోలిస్తే విశేషంగా విజయవంతమైందని తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల పల్లెలు ప్రగతి బాటన పడుతున్నాయని ఆయన అన్నారు. ఈ స్పూర్తితో ప్రతి మూడు నెలలకోసారి పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించి, గ్రామాలు బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో రెండోవిడత పల్లె ప్రగతి చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ మాటల మనిషి కాదనీ.. చేతల మనిషని మంత్రి కొనియాడారు. ఆయన చేసిన ప్రతి పనికి అర్థం ఉంటుందని ఆయన తెలిపారు. పల్లె నుంచి పట్టణం దాకా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం మామూలు విషయం కాదన్నారు మంత్రి.


Latest News
 

నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM
ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM