బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్

byసూర్య | Tue, Jan 14, 2020, 01:30 PM

తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. నిర్మల్ జిల్లాలోని భైంసా వెళ్లడానికి ఆయన చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఛలో భైంసా ఆందోళనను భగ్నం చేశారు. సోమవారం రాత్రి భైంసాలో చోటు చేసుకున్న అల్లర్లు, రెండు వర్గాల మధ్య సంభవించిన దాడులు, ప్రతిదాడులకు నిరసనగా ఆయన ఛలో భైంసాకు పిలుపునిచ్చారు.ఈ ఆందోళన వల్ల ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమౌతాయనే అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్తలు చేపట్టారు. రాజాసింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. భైంసాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఓ చిన్న గొడవ.. తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఒక వర్గం వారి నివాసాలపై మరొక వర్గం వారు దాడులు చేశారు. ప్రతిదాడులకు దిగారు. ఈ ఘటన అనంతరం పోలీసులు భైంసాలో 144 సెక్షన్‌ను విధించారు. ఫలితంగా పరిస్థితిని అదుపులోకి వచ్చింది.


 


భైంసాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి దృష్టిలో ఉంచుకుని అక్కడ సుమారు రెండు బెటాలియన్ల మేర రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరింపజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉత్తర తెలంగాణలో నాలుగు జిల్లాల్లో ఇంటర్‌నెట్‌ను నిషేధించారు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వదంతులు వ్యాపించకుండా ఇంటర్నెట్ ఆపేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పోలీసులు నిఘా ఉంచారు.


Latest News
 

ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM
ఆ మార్గంలో జర్నీ చేసేవారికి టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్ Thu, Apr 25, 2024, 07:50 PM
భర్తకు గుడి కట్టిన భార్య.. పతిపై ఎంత ప్రేమ Thu, Apr 25, 2024, 07:44 PM
నగరవాసికి అసౌకర్యం.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు నోటీసులు Thu, Apr 25, 2024, 07:38 PM
హనుమాన్ ఆలయానికి భూమిని విరాళమిచ్చిన ముస్లిం.. ఎంత గొప్ప మనసో Thu, Apr 25, 2024, 07:34 PM