రూ.1,400 తగ్గిన బంగారం ధర

byసూర్య | Mon, Jan 13, 2020, 06:23 PM

హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర జనవరి 8న రూ.42,860 ఉంది. వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇలా రికార్డులు సృష్టించాయి. కానీ జనవరి 13న 10 గ్రాముల బంగారం రూ.41,460 ధరకు పడిపోయింది. అంటే 6 రోజుల్లో ఏకంగా రూ.1,400 తగ్గింది. కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరలు ఇలా మెల్లమెల్లగా దిగొస్తున్నాయి. సోమవారం నాటి బంగారం ధరలు చూస్తే హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.600 తగ్గింది. రూ.42,060 నుంచి రూ.41,460 ధరకు దిగొచ్చింది బంగారం. ఇక 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.200 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,010. న్యూ ఢిల్లీలో బంగారం ధర రూ.236 తగ్గింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.40,432. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,550 డాలర్లు.


బంగారం మాత్రమే కాదు... వెండి ధరలు కూడా దిగొస్తున్నాయి. జనవరి 8న హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.51,000 ఉంటే జనవరి 13న కిలో వెండి రూ.49,000 ధరకు దిగొచ్చింది. అంటే ఆరు రోజుల్లో రూ.2,000 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి ధర రూ.376 తగ్గి రూ.47,635 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 17.97 డాలర్లు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడం, రూపాయి బలపడటం లాంటి కారణాలతో బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడింది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM