సబితా ఇంద్రారెడ్డి పై మండిపడ్డ బిజెపి నేత ప్రభాకర్

byసూర్య | Mon, Jan 13, 2020, 03:44 PM

రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సంబంధమున్న సబితా ఇంద్రారెడ్డికి కేబినెట్‌లో కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. వెంటనే మంత్రిపదవికి రాజీనామా చేయాలన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ వివరాలను ప్రజలకు వివరించాల్సిన అవసరముందన్నారు. బీజేపీ ఎక్కడ ఉందని మంత్రి కేటీఆర్ అంటున్నారని.. నిజామాబాద్‌లో కవితను, కరీంనగర్‌లో వినోద్‌ను అడిగితే చెబుతారని తెలిపారు. పార్టీలను, వ్యక్తులను ప్రలోభ పెట్టడంలో టీఆర్ఎస్‌ను మించిన పార్టీ లేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నిలబెట్టిన 3వేలమంది అభ్యర్థుల్లో 15 వందలమంది అభ్యర్థులు టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారన్నారు. పార్టీలు వేరైనా టీఆర్ఎస్, కాంగ్రెస్‌ రాష్ట్రంలో కలిసి పని చేస్తున్నాయని.. రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో ఎంఐఎం అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. సీఏఏ వ్యతిరేక శక్తుల ర్యాలీలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వొద్దని కోరుతున్నామన్నారు.


Latest News
 

యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు Wed, Apr 24, 2024, 01:43 PM