హైదరాబాద్‌లో మరో కీచక ఘటన

byసూర్య | Mon, Jan 13, 2020, 03:06 PM

మహిళా ప్రయాణికులపై క్యాబ్ డ్రైవర్ల ఘాతుకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో మరో కీచక ఘటన చోటుచేసుకుంది. ఓ ఎయిర్‌లైన్స్‌ సంస్థలో పనిచేస్తున్న యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన శంషాబాద్‌లోని ఆర్జీఐఏ పీఎస్ పరిధిలో జరిగింది. శంషాబాద్‌కు చెందిన యువతి(20) విమానాశ్రయంలోని ఓ ఎయిర్‌లైన్స్‌ సంస్థలో విధులు నిర్వహిస్తోంది. రోజూలానే విధులకు వెళ్లేందుకు ఆదివారం జాతీయ రహదారిపై అంబేడ్కర్‌ జంక్షన్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తోంది.


ఈ క్రమంలో ఓ క్యాబ్ డ్రైవర్ వచ్చి ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నానంటూ ఆమెను ఎక్కించుకున్నాడు. అయితే.. కొద్ది దూరం వెళ్లాక నిర్మానుష్య ప్రదేశంలో కారును డ్రైవర్‌ రోడ్డు పక్కన ఆపి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె గట్టిగా అరుస్తూ కాపాడమని కేకలు వేయడంతో కారు డోర్‌ను లాక్‌ చేశాడు. ఆమె నుంచి సెల్‌ఫోన్ లాక్కుని కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించాడు. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న కొందరు వాహనదారులు ఆ ఘటనను చూసి కారు చుట్టూ గుమిగూడారు. దీంతో భయపడ్డ ఆ కామాంధుడు యువతితో పాటు కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీంతో బాధితురాలు నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కారు నంబర్ ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడి వివరాలు ఆరా తీస్తున్నారు.


Latest News
 

సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు Wed, Apr 24, 2024, 01:43 PM
పిచ్చి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు Wed, Apr 24, 2024, 01:41 PM
ట్రాన్స్‌కో ఉద్యోగి ఇంట్లో ఏసీబీ దాడులు Wed, Apr 24, 2024, 01:41 PM
విద్యార్థులు గంజాయికి దూరంగా ఉండాలి Wed, Apr 24, 2024, 01:37 PM