బాలుడి గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క..

byసూర్య | Mon, Jan 13, 2020, 01:14 PM

పదేళ్ల బాలుడి ఆహారనాళంలో ఇరుక్కుపోయిన చికెన్‌ ఎముకను కాంటినెంటల్‌ వైద్యులు శస్త్ర చికిత్స చేసి బయటకు తీశారు. లింగంపల్లికి చెందిన బాలుడు(10) భోజనం చేస్తు న్న సమయంలో చికెన్‌ ఎముక గొంతులోఇరుక్కుపోయి ఆ తర్వాత ఆహారనాళంలోకి జారుకుంది. రెండు రోజుల పాటు అనేక ప్రయత్నాలు చేసినా ఫ లితం లేకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు కాంటినెంటల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి మెడికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్‌ రఘురాం కొండల నేతృత్వంలోని వైద్యులు ముందుగా ఆహారనాళంలో ఇరుక్కున్న ఎముకను జాగ్రత్తగా తీసి, ఎండోస్కోపిక్‌ ద్వారా క్లీనింగ్‌ చేశారు. స్టెంటింగ్‌ కూ డా చేయడంతో ఆహారనాళం పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. ప్రస్తుతం బాలుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాడని డాక్టర్‌ రఘురాం చెప్పారు. ఆహారనాళంలో ఏదైనా ఇరుక్కుంటే దానిని అత్యవసరంగా తొలగించాలని డాక్టర్‌ రఘురాం తెలిపారు.


Latest News
 

ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత Thu, Apr 25, 2024, 12:20 PM
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM
అవకాశం ఇవ్వండి అభివృధి చేసి చూపిస్తా : ఎంపీ అభ్యర్థి చామల Thu, Apr 25, 2024, 12:10 PM
నల్గొండ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా సురేష్ Thu, Apr 25, 2024, 12:08 PM
కోదాడ శివార్లలో రక్త మోడిన రోడ్డు Thu, Apr 25, 2024, 12:04 PM