ఫలించిన తెలంగాణ సర్కార్ ప్లాన్

byసూర్య | Mon, Jan 13, 2020, 12:42 PM

తెలంగాణలో పల్లె ప్రగతి మంత్రం ఫలించి పల్లె చిత్రం మారిపోయింది. హరితహారమే లక్ష్యంగా పారిశుద్ధ్య నిర్వహణే కర్తవ్యంగా తెలంగాణలోని 12,751 పంచాయతీల్లో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. అక్షరాసత్యలోనూ ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని తెలంగాణ సర్కార్ భావించింది. ఇందులో భాగంగా ఈచ్ వన్ టీచ్ వన్ నినాదం కింద తొలిసారి గ్రామ పంచాయతీల్లో 25,03,901 మంది వయోజనులను నిరక్షరాస్యులుగా గుర్తించింది.


ఇందులో అత్యధికంగా నారాయణపేట జిల్లాలో 1,54,804.. నల్గొండ జిల్లాలో 1,47,054 మంది వయోజన నిరక్షరాస్యులు ఉన్నారు. ఇక యాదాద్రి జిల్లాలో 1,32,412 మంది.. మహబూబ్ నగర్ జిల్లాలో 1,21,847 మంది, నిర్మల్ జిల్లాలో 1,20,597 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించింది. వీరి కోసం తెలంగాణ సర్కార్ అక్షరయజ్ఞం చేపట్టనుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా విస్తృతంగా అభివృద్ధి, అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.


తొలిరోజు గ్రామ సభల్లో వార్షిక ప్రణాళిక, పంచాయతీ ఆదాయ వ్యయాలు, తొలి విడత పల్లె ప్రగతి నివేదికను గ్రామస్థులు ముందుంచడం ద్వారా పంచాయతీ పాలనలో పాదర్శకత, జవాబు దారీ తనాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. గ్రామ సభలు, పాదయాత్రలు, శ్రమదానాలు, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల హడావుడితో గత 11 రోజులు పల్లెలో సందడి వాతావరణం కనిపించింది. పరిసరాల పరిశుభ్రత, పిచ్చిమొక్కల తొలగింపు, వైకుంఠ ధామాలు, కంపోస్టు యార్డు, శాశ్వత నర్సరీలకు స్థలాలను గుర్తించారు.


పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాయి. తెలంగాణ సర్కార్ ఇచ్చిన పిలుపుతో పల్లె దాటి సొంతూరిపై మమకారంతో సమస్యల పరిష్కారానికి పలువురు దాతలు ముందుకొచ్చి 11.64 కోట్ల రూపాయల విరాళాలను అందజేశారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM