ఏపీ పరిస్థితి చూస్తుంటే ఓ భారత పౌరుడిగా ఎంతో బాధగా ఉంది : రేవంత్ రెడ్డి

byసూర్య | Sun, Jan 12, 2020, 06:45 PM

ఏపీలో ఓవైపు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తుండగా, మరోవైపు మూడు రాజధానుల అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఏపీ పరిస్థితులపై స్పందించారు. అన్నదమ్ములుగా ఉన్న రాష్ట్రంలో నేడు సంక్షోభం నెలకొందనిలో, కేవలం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి లాభం చేకూర్చేందుకే గందరగోళ పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు.


అయితే, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత పుంజుకుందని తెలిపారు. ఓ తెలంగాణ వ్యక్తిగా ఈ పరిణామం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని, కానీ ఏపీ పరిస్థితి చూస్తుంటే ఓ భారత పౌరుడిగా ఎంతో బాధగా ఉందని వివరించారు. ప్రస్తుతం ఏపీ కుప్పకూలే పరిస్థితిలో ఉందని అన్నారు. ఏపీ తిరోగమనం వల్ల తెలంగాణ లాభపడుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు.


Latest News
 

కెసిఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు Tue, Apr 16, 2024, 03:32 PM
స్పోర్ట్స్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్ Tue, Apr 16, 2024, 02:48 PM
ఎండల నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 02:48 PM
మహాజన్ సంపర్క్ అభియాన్ Tue, Apr 16, 2024, 02:04 PM
ఎల్లమ్మ తల్లికి గ్రామస్తుల ప్రత్యేక పూజలు Tue, Apr 16, 2024, 01:30 PM