హైదరాబాద్ యువతికి వేధింపులు

byసూర్య | Sun, Jan 12, 2020, 10:48 AM

సెల్ ఫోన్ లో మాట్లాడిన పరిచయంతో ప్రేమ పేరిట యువతిని వేధిస్తున్న ఓ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, కూకట్ పల్లి గాజుల రామారం ప్రాంతానికి చెందిన ఓ యువతి (22) ఓ ప్రైవేటు కార్యాలయంలో పనిచేస్తోంది. బెంగళూరులో పనిచేస్తున్న ప్రశాంత్ (24) అనే యువకుడు ఆమెకు సెల్ ఫోన్ లో పరిచయం అయ్యాడు.ఈ క్రమంలో హైదరాబాద్ కు వచ్చిన అతను, తనను కలవాలని, లేకుంటే ఆఫీసుకు వచ్చి గొడవ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమె, ఓ పార్కులో అతన్ని కలిసేందుకు వెళ్లింది. ఆ సమయంలో అతను అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే, చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. 10వ తేదీన ఆఫీసు వద్దకు వచ్చిన ప్రశాంత్, తోటి ఉద్యోగుల ముందు మరోసారి వేధించాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె, పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM