మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పట్ల అసభ్యంగా

byసూర్య | Sat, Jan 11, 2020, 05:02 PM

హైదరాబాద్‌లో ఇటీవలే గర్భిణి అయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై నడిరోడ్డు మీద ఓ ఎన్నారై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మరిచిపోకముందే.. అలాంటి ఘటనే పునరావృతమైంది. బంజారాహిల్స్‌లో ఓ ఆటో డ్రైవర్ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు సకాలంలో స్పందించి కీచకుడి ఆటకట్టించారు.


ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎప్పటి మాదిరిగానే శనివారం ఉద్యోగానికి బయల్దేరింది. అయితే బంజారాహిల్స్‌లో ఆటో డ్రైవర్ నరసంహ ఆమెను అటకాయించి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడిని ప్రశ్నించారు. అయితే అతడు అక్కడి నుంచి జారుకునేందుకు ప్రయత్నించడంతో అందరూ కలిసి దేహశుద్ధి చేశారు. అనంతరం నరసింహను విద్యుత్ స్తంభానికి కట్టేసి పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడి నుంచి వివరాలు సేకరించి అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


కాగా, ఇటీవలే మాదాపూర్‌లో ఓ వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌ వారాసిగూడలో నివాసముంటున్న ఓ మహిళ మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసేది. ఫోన్‌‌లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆమె మెడపై చేయి వేసి అసభ్యకరంగా తాకాడు. వెంటనే స్పందించిన ఆమె అతడిపై ఎదురు దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్టు చేశారు.


 


 


Latest News
 

గంజాయిని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు Sat, Apr 20, 2024, 12:34 PM
ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని ప్రచారం Sat, Apr 20, 2024, 12:32 PM
విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి: సంక్షేమఅధికారి బావయ్య Sat, Apr 20, 2024, 12:30 PM
వైభవంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం Sat, Apr 20, 2024, 12:29 PM
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక Sat, Apr 20, 2024, 12:26 PM