150 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత..

byసూర్య | Sat, Jan 11, 2020, 11:37 AM

లబ్ధిదారుల నుంచి రేషన్‌ బియ్యం సేకరించి.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు తరలించేందుకు యత్నిస్తున్న డీసీఎం లోడ్‌ను బాలానగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. 150 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీసీఎం డ్రైవర్‌ తప్పించుకున్నాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గంపల బస్తీలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సుభాష్‌నగర్‌ గంపలబస్తీలో డీసీఎం(టీఎస్‌ 06 యూబీ 0520)లో రేషన్‌ బియ్యం ఉన్నట్లు బాలానగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పొలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు వెళ్లి డీసీఎంను తనిఖీ చేయగా రేషన్‌ బియ్యం బయపడింది. బియ్యం తరలిస్తున్న సయ్యద్‌ అక్రమ్‌, సమీర్‌ భారతీలను అదుపులోకి తీసుకుని విచారించగా.. వివిధ బస్తీల్లో రేషన్‌ బియ్యం సేకరించి జహీరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు జీడిమెట్ల పోలీసులు, సివిల్‌ సైఫ్లై అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM