చెన్నై సెంట్రల్‌ - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు

byసూర్య | Tue, Oct 15, 2019, 08:50 AM

గుంటూరు : గుంటూరు మీదుగా వారానికి రెండుసార్లు చెన్నై - సికింద్రాబాద్‌ - చెన్నై ప్రత్యేక రైళ్లని నడిపేందుకు రైల్వేబోర్డు అనుమతించింది. ఇప్పటివరకు ఈమార్గంలో నిత్యం రాత్రి వేళ నడిచే చెన్నై ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ఉండగా ఎప్పటినుంచో ప్రయాణికుల నుంచి వస్తోన్న డిమాండ్‌ మేరకు మరో రైలుని బోర్డు పట్టాలెక్కించింది. 


తొలుత ప్రత్యేక రైలుగా నడిపి ప్రయాణికుల నుంచి లభించే ఆదరణని బట్టి రెగ్యులర్‌ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా డిసెంబరు నెలాఖరు వరకు ప్రతీ శుక్ర, ఆదివారాలలో నెం బరు 06059 చెన్నై సెంట్రల్‌ - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు రాత్రి 7.30 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 1.48కి తెనాలి, 2.35కి గుంటూరు, 3.38కి పిడుగు రాళ్ల, 4.48కి మిర్యాలగూడ, వేకువజామున 5.33కి నల్గొండ, మరుసటి రోజు ఉదయం 8.25కి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది.


 


 నెంబరు 06060 సికింద్రాబాద్‌ - చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు ప్రతి సోమ, శనివారంలలో రాత్రి 8 గంటలకు బయలుదేరి 10.13కి నల్గొండ, 11 గంటలకు మిర్యాలగూడ, అర్ధరాత్రి 12.18కి పిడుగురాళ్ల, 1.30కి గుంటూరు, 2.18కి తెనాలి, మరుసటి రోజు ఉదయం 10 గం టలకు చెన్నై సెంట్రల్‌ చేరుకునేలా సమయపట్టికని రూపొందించారు. 


 


దీనివల్ల గుంటూరు మీదుగా చెన్నై సెంట్రల్‌కి మరొక రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు ఉప్పులూరి శశిధర్‌చౌదరి తెలిపారు.


 


 


Latest News
 

తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించిన ప్రముఖ సంస్థ Thu, Apr 25, 2024, 07:06 PM
ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM