బ్రాండ్‌ తెలంగాణ అంబాసిడర్‌గా న్యూజిలాండ్‌ ఎంపీ!

byసూర్య | Mon, Oct 14, 2019, 06:14 PM

తెలంగాణ ఉత్పత్తులు అనేక దేశాల్లో ప్రత్యేకతను చాటుకుంటుండగా.. న్యూజిలాండ్‌ బతుకమ్మ వేడుకల్లో మరోసారి సిరిసిల్ల చీరెకు గుర్తింపు లభించింది. న్యూజిలాండ్‌లో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన దక్షిణ భారతదేశానికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్‌ న్యూజిలాండ్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో సిరిసిల్ల చీరకట్టుకొని సందడి చేశారు. బ్రాండ్‌ తెలంగాణ ద్వారా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్‌ తయారు చేసిన చీరెను ఆమె కట్టుకోవడంతోపాటు బ్రాండ్‌ తెలంగాణకు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ముందుకొచ్చారు. ప్రియాంక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బ్రాండ్‌ తెలంగాణ వ్యవస్థాపకురాలు సునీతా విజయ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంక రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం బతుకమ్మ చీరెలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.


 


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM