కేసీఆర్ కార్యాలయానికి ఫోన్ చేసి ప్రశ్నించిన సామాన్యుడి!

byసూర్య | Mon, Oct 14, 2019, 01:34 PM

ఓ సామాన్యుడు సీఎం కార్యాలయం హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి తన బాధను చెప్పుకున్నాడు. ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే. ఆర్టీసీ బస్సులు కూడా మా కోసమే. కానీ ఇప్పుడీ పరిస్థితి ఏంటి? మధ్యలో మేం నలిగిపోతున్నాం. పిల్లల స్కూళ్లకు సెలవులు పొడిగించడం ఎందుకు. ఇప్పటికే 16 రోజులు సెలవులిచ్చారు. చదివిందంతా పిల్లలు మరచిపోతున్నారు. ఆర్టీసీ వాళ్లు సమ్మె చేస్తే, స్కూలు బస్సులను వాడుకోవడం ఏంటి?" .


తన పేరు రంజిత్ కుమార్ అని, తనది కరీంనగర్ అని వెల్లడించిన ఆయన, ముఖ్యమంత్రి రాష్ట్రానికి తండిరి వంటి వాడని, పిల్లలు అల్లరి చేస్తుంటే, పిలిచి, మాట్లాడి, బుద్ధి చెప్పాలిగానీ, 'నువ్వు పోతేపో... నేను పీకేస్తా' అని కయ్యాలు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించాడు. ఇది పద్ధతి కాదని చెప్పాడు. ఉద్యమాలతోనే తెలంగాణను తెచ్చుకున్నామని, అటువంటి ఉద్యమాలను అణచి వేయడం ఏంటని ప్రశ్నించాడు. తెలంగాణ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని అన్నాడు. 'నేను విన, నేను జేయ' అంటే రాష్ట్రంలో నడవదని హెచ్చరించాడు. తన మాటలను సార్ దృష్టికి తీసుకెళ్లాలని హెల్ప్ లైన్ లో రంజిత్ చేసిన వ్యాఖ్యలను టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. కాగా, సిద్ధిపేటకు చెందిన కరుణాకర్ అనే యువకుడు సైతం ఇదే హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమ్మెపై ఆవేదన వ్యక్తం చేశాడు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM