తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన

byసూర్య | Mon, Oct 14, 2019, 11:50 AM

 చేసింది వాతావరణ శాఖ. రానున్న 48 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపారు.


ఉపరితల ఆవర్తనానికి తోడు క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం(అక్టోబర్ 13,2019) ఉదయం నుంచి సాయంత్రం 7 వరకు హైదరాబాద్ గోల్కొండలో అత్యధికంగా 2.2 సెం.మీలు, మూసాపేటలో 2.0 సెం.మీ., శేరిలింగంపల్లి పరిధిలో 1.9 సెం.మీలు, ఖైరతాబాద్‌లో 1.8సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.  


మరో నాలుగు రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఖమ్మం నగరంతోపాటు కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, మధిర, వైరా, సత్తుపల్లి తదితర మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 2.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.


కొన్ని రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండగా ఉంటుంది. ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. నల్లని మేఘాలు ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి. దట్టమైన మబ్బులు వచ్చేస్తున్నాయి. క్షణాల్లోనే భారీ వర్షం పడుతోంది. కొన్ని రోజులగా ఇలాగే జరుగుతోంది. కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.


Latest News
 

అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM
సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌దే గెలుపు.. ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుంది: రేవంత్ రెడ్డి Wed, Apr 24, 2024, 07:49 PM
తుపాకీ మిస్ ఫైర్.. సీఆర్‌పీఎఫ్‌ డీస్పీపీ మృతి Wed, Apr 24, 2024, 07:42 PM
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణాలు సాగించేవారికి గుడ్‌‍న్యూస్ Wed, Apr 24, 2024, 07:37 PM