సిరిసిల్ల చీరెకట్టులో న్యూజిలాండ్ ఎంపీ

byసూర్య | Mon, Oct 14, 2019, 10:26 AM

తెలంగాణ ఉత్పత్తులు అనేక దేశాల్లో ప్రత్యేకతను చాటుకుంటుండగా.. న్యూజిలాండ్ బతుకమ్మ వేడుకల్లో మరోసారి సిరిసిల్ల చీరెకు గుర్తింపు లభించింది. న్యూజిలాండ్‌లో ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ భారతదేశానికి చెందిన ప్రియాంకరాధాకృష్ణన్ న్యూజిలాండ్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో సిరిసిల్ల చీరెకట్టుకొని సందడి చేశారు. బ్రాండ్ తెలంగాణ ద్వారా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన చీరెను ఆమె కట్టుకోవడంతోపాటు బ్రాండ్ తెలంగాణకు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ముందుకొచ్చారు. ప్రియాంక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపకురాలు సునీతా విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంక రాధాకృష్ణన్ మాట్లాడుతూ... తెలంగాణలో ప్రభుత్వం బతుకమ్మ చీరెలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM