ఆర్టీసీది ఎర్రబస్సు సమస్య కాదు: రేవంత్ రెడ్డి

byసూర్య | Sun, Oct 13, 2019, 07:55 PM

ఆర్టీసీది ఎర్ర బస్సు సమస్య కాదని పేద ప్రజల సమస్య అని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు ఇస్తానన్న కేసీఆర్ మరిచారా అని రేవంత్ ప్రశ్నించారు. సమ్మెకు దారి తీసిన కారణాలపై కేసీఆర్ ఆలోచన చేసుకుని వెంటనే వారి సమస్యకు పరిష్కారం కల్పించాలన్నారు. రెండ్రోజులు డ్యూటీకి రానివారిని డిస్మిస్ చేస్తే.. ఆరేళ్లుగా సచివాలయానికి రాని కేసీఆర్ పై పీడియాక్ట్ పెట్టి అండమాన్ జైల్లో వేయాలన్నారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పిల్లల చావుకు, ఇప్పుడు డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు కారణమయ్యారని ఫైర్ అయ్యారు. ఆర్టీసీ సమ్మెను అణచివేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేశారని, ఒకవేళ సమ్మె విఫలమైతే తెలంగాణలో ప్రశ్నించే గొంతులు ఉండవన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM