రేషన్ షాప్ సీజు

byసూర్య | Sun, Oct 13, 2019, 12:22 PM

మెదక్ జిల్లా చిలిపి చెడు మండల పరిధిలోని బండపోతుగల్ గ్రామంలో ఉన్న షాప్ నెంబర్ 7 రేషన్ డీలర్ నరసింహారెడ్డి రోజువారి సరుకులు ఒకటో తారీకు నుంచి 15 తారీకు వరకు విక్రయించి ఉండగా అందులో 18 క్వింటాల 75 కిలోలు బియ్యం ఉన్నట్టుగా ఆన్ లైన్ లో చూపిస్తుంది. గ్రామస్తులు ఫిర్యాదు మేరకు ఆర్ఐ రుక్నుద్దీన్ తనిఖీ చేయగా రేషన్ షాపులో నిల్వ ఉండాల్సిన బియ్యం ఆన్ లైన్ ప్రకారంగా ఒక కిలో కూడా లేకపోవడం గమనార్హం. ఇందుకుగాను గ్రామస్తులు ఫిర్యాదు మేరకు ఆర్ఐ రేషన్ షాపులను తనిఖీ చేసి ఎలక్ట్రికల్ మిషన్, బయోమెట్రిక్ థంబ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి నివేదికను జిల్లా అధికారులకు సమర్పిస్తామని ఆర్ఐ విలేకరులకు తెలిపారు. అప్పటివరకు తాత్కాలికంగా రేషన్ షాప్ స్థానంలో చిలిపి చెడు డీలర్ కు బాధ్యతలు అప్పగించాలని ఆర్ఐ తెలిపారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM