మానిఫెస్టోలో ఎక్కడా కూడా చెప్ప‌లేదు: మంత్రి పువ్వాడ

byసూర్య | Sat, Oct 12, 2019, 09:15 PM

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను ఉద్దేశించి రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమ్మెపై ప్రభుత్వం తన విదానాన్ని నాలుగో తారీకునే చెప్పిందని అయినా.. తమ ఎన్నికల మానిఫెస్టోలో ఎక్కడా కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదన్నారు. సమ్మెను సమర్దతంగా ఎదుర్కొని ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చామన్నారు. చర్చల నుండి వెల్లిపోయింది కార్మిక సంఘం నాయకులేనన్నారు. కార్మిక సంఘాలను అడ్డుపెట్టుకుని మాట్లాడుతున్న ప్రతిపక్షాలు...ప్రజలకు ఇబ్బందులను గురిచేసే చర్యలను సమర్దిస్తరా.. అంటూ ప్రశ్నించారు. మీ ప్రభుత్వాలు అదికారంలో ఉన్న చోట ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారా ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. అసంబద్ద ఆరోపణలు చేస్తే ప్రజలు మిమ్మల్నీ చీదరించుకుంటరని, ఇలా చేస్తేనే గత ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఆర్టీసీ ఆస్తుల విలువ 4416 కొట్లని, పదమూడు కోట్లు నష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి రవాణా శాఖ మంత్రి గా ఉన్న కేసియార్ గారు 14 కోట్లకు లాభాలు తెచ్చారన్నారు. పండగ సమయంలో సమ్మెకు వెళ్లి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూశారు. కానీ బెడిసికొట్టిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రైళ్లనే ప్రైవేట్ పరం చేస్తుందని ప్రతిపక్షాలు బాద్యాతాయుతంగా మాట్లాడాలన్నారు. కార్మికులు విదుల్లోకి రాకున్న ప్రజా రవాణా సాఫీగానే సాగుతుందని, ప్రయాణికులు తమ రవాణా సౌకర్యాలు మార్చుకుంటున్నప్పుడు, ఆర్టీసీ కూడా మారాలన్నారు. సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి తీసుకెల్లారు. వీరు గతంలో ఎన్నడు సమ్మెలోకి వెల్లలేదు. వీరి ద్వారానే టికెటింగ్ మిషన్ లు ఇచ్చే అవకాశం ఉండేది. పోలీస్, రవాణా శాఖల సమన్వయం తో అధిక చార్జీలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. బస్ పాస్ లు అన్ని పని చేస్తయి. అని తెలిపారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM