నగరంలో మావోల హ‌ల్‌చ‌ల్‌!

byసూర్య | Sat, Oct 12, 2019, 08:54 PM

తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటి సహా..జగన్‌, సాయన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పలు విద్యార్థి సంఘాలు కొంతకాలంగా మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థి నేతలు సందీప్, అనుదీప్‌, నాగరాజు, గోపి, ఖాసిం, రమేష్‌రెడ్డి..మహేశ్వర్‌రెడ్డి, శంకర్‌రెడ్డిపై గతంలోనే కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. విద్యార్థి నేతల కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టామని పోలీసుల వెల్లదించారు. దీనికి సంబంధించిన 30 సంస్థలను నిషేధించినట్టు పోలీసుల ప్రకటించారు. గత కొంతకాలంగా మావోయిస్టులతో టచ్‌లో ఉన్న జగన్‌ మావోయిస్టులకు ఫండ్స్‌ ఇవ్వాలని కార్పొరేట్‌ కంపెనీలను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జగన్‌, మద్దిలేటి ఇళ్లలో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగన్‌, మద్దిలేటిపై పుణె, కర్నాటకలో కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) సంస్థ నిషేధిత మావోయిస్టు పార్టీ నుంచి ఆవిర్భవించిందని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. రెండు రోజులుగా నగరంలో అలజడిరేపుతున్న టీవీవీ నాయకుల అరెస్టులపై.. ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మావోయిస్టు పార్టీసహా.. పలు సంస్థలను రాష్ట్రప్రభుత్వం నిషేధించిందన్నారు. వివిధ సంఘాల పేరుతో విద్యార్థులు, యువతను ఆకర్షిస్తూ.. మావోయిజం వైపు మళ్లిస్తున్నారని సీపీ ఆరోపించారు. టీవీవీ నేతలకు.. దంతేవాడ, బీజాపూర్‌లలో ఉన్న మావోయిస్టులో సంబంధాలున్నాయనే ఆధారాలు తమకు లభించాయన్నారు. దీనిపై నాగరాజు అలియాస్‌ నాగన్నపై గద్వాల్‌లో, రాహుల్‌పై సుబేదారిలో, గోపీపై సూర్యాపేటలో, ఖాసీంపై అమ్రాబాద్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, ములుగులో, రమేశ్‌పై నాచారం పీఎ్‌సలో, మహేశ్వర్‌రెడ్డిపై సూర్యాపేట, ఓయూలో, దేవిరెడ్డిపై సూర్యాపేట, పంజాగుట్టల్లో కేసులున్నాయన్నారు. వీరితో పాటు సాయన్న, పురుషోత్తమ్‌రెడ్డిపైనా కేసులు ఉన్నాయని సీపీ వివరించారు. నల్లకుంట పీఎస్‌ పరిధిలో బండారి మద్దిలేటి(30) ఇంట్లో జరిపిన సోదాల్లో విప్లవ సాహిత్యం లభ్యమైందని తెలిపారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM