బెంగళూరు కంటే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది : కేటీఆర్

byసూర్య | Sat, Oct 12, 2019, 12:09 PM

హైదరాబాద్ : హెచ్‌ఐసీసీలో రెండో రోజు వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్, తెలంగాణ ప్రభుత్వం, ఇండియా డిజైన్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి.


ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తొలిసారి వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉంది. ఔత్సాహికులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఐటీ రంగంలో బెంగళూరు కంటే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్‌లో టీ-హబ్, టీ-వర్క్స్, ఇమేజ్ టవర్స్ నిర్మాణం జరుగుతుంది. తెలంగాణ టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతుంది. నేషనల్ డిజైన్ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ కాబోతుంది అని మంత్రి తెలిపారు. పద్మశ్రీ చింతకింది మల్లేషం తయారు చేసిన ఆసు యంత్రాలను చేనేత కళాకారులకు మంత్రి కేటీఆర్ అందజేశారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM