నగరంలో వ్యభిచారం నిర్వహిస్తోన్న ముఠా...విదేశాల నుంచి యువతులను

byసూర్య | Sat, Oct 12, 2019, 11:19 AM

పొరుగు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి యువతులను రప్పించి నగరంలో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ విధానంలో వ్యభిచారం నిర్వహించే మరో అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టయ్యింది. హైదరాబాద్‌లో నగరంలో వ్యభిచారం నిర్వహిస్తోన్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్‌లో పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన దంపతులు హైటెక్ పద్దతిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన రజియా, ఆమె భర్త సిరాజుద్దీన్‌లు ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.


గత కొన్ని నెలలుగా సాగుతోన్న ఈ ముఠా కార్యకలాపాల గురించి పక్కగా సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం వారి ఫ్లాట్‌పై దాడిచేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో పాటు పలువురు విటులను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన నలుగురు మహిళలు కూడా పట్టుబడ్డారు. వారి దగ్గర నుంచి రూ.6,580 నగదు, నాలుగు సెల్ ఫోన్లు, 36 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సెక్షన్ 370A,పిటా ఎక్ట్ కింద కేసు నమోదుచేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఆపరేషన్‌లో మల్కాజిగిరి ఎస్ఓటీ, నెరేడ్‌మెట్ పోలీసుల సంయుక్తంగా నిర్వహించారు.


 


గత నెలలోనే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మనుషుల అక్రమ రవాణాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ రవాణాకు అడ్డుకట్ట వేసింది. బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను అక్రమంగా తీసుకొచ్చి వారితో గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్న ముఠాను ఛత్రినాక పోలీసుల సాయంతో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ ఇలాంటి కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి. పాతబస్తీకి చెందిన యూసుఫ్‌ ఖాన్‌, అతడి భార్య బేగంను ఈ కేసులో ప్రధాన నిందితులు. బంగ్లాదేశ్‌ నుంచి ఐదుగురు యువతులను నగరానికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా ప్రణాళికతో దాడి చేసిన ఎన్‌ఐఏ అధికారులు ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువతులను వారి దేశానికి తిప్పి పంపారు.


 


 


 


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM