నేడు అన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికుల మౌనదీక్ష

byసూర్య | Sat, Oct 12, 2019, 09:52 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టికి 8వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఇవాళ అన్ని డిపోల ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ కార్మికులు మౌనదీక్ష చేయనున్నారు. జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఈరోజు డిపోల ముందు, గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాల వద్ద ఆర్టీసీ కార్మికులు మౌనదీక్షలు, నిరసనలు తెలపాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు హైరదరాబాద్‌లోని బస్‌ భవన్‌ ముందు ఆర్టీసీ కార్మికులు నిరసన తెలపనున్నారు. కాగా ఆర్టీసీ జేఏసీ రాజకీయ నేతల మద్దతును కూడగడుతోంది. ఇవాళ అఖిలపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం కానుంది. భవిష్యత్‌ కార్యాచరణ, రాష్ట్ర బంద్‌ తేదీలపై జేఏసీ నాయకులు, విపక్ష నేతలు చర్చించనున్నారు. ఆర్టీసీని విలీనం చేయాలని, సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM