కొత్త ఇల్లు కొనేవారు ఖ‌చ్చితంగా ఇక్క‌డ‌కి వెళ్లిండి

byసూర్య | Sat, Oct 12, 2019, 09:04 AM

 హైదరాబాద్ లోని హైటెక్స్ లో  తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఈ నెల 18వ తేదీ నుంచి మూడురోజులపాటు ప్రాపర్టీ షో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు 100 మంది డెవలపర్లు, బిల్డర్లు, ప్రమోటర్లు, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్లు, రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్లు, ఆర్ధిక సంస్థలు పాల్గొన‌నున్న ఈ షోలకి  కొత్త ఇల్లు కొనాలి అనుకునే వారు వెళితే ఆయా సంస్థలు అందించే సేవల వివరాలతో పాటు  చేసే ఉత్పత్తులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.  త‌ద్వారా త‌మ బడ్జెట్‌కు స‌రిప‌డా ఇంటిని ఎంపిక చేసుకునే అవ‌కాశం ఉంది.
అంతే కాదు ఈ ప్రాప‌ర్టీ షోలో ఎల్ ఐ సి హోసింగ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంకు అఫ్ బరోడా, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా,  హెచ్ డీ ఎఫ్ సి, ఐ సి ఐ సి ఐ బ్యాంక్, సుందరం బీ ఎం పీ పరిబాస్ హోమ్ ఫైనాన్స్, ఐ ఐ ఎఫ్ ఎల్ హోమ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు పాల్గొననుండ‌టంతో మ‌న ఇంటి కోసం ఆర్ధిక స‌హ‌కారం వ‌డ్డీ రేట్లు త‌దిత‌రాలు తెలుసుకునే ఆస్కారం ద‌క్కుతుంది.ప్రాపర్టీ షో లకు ప్రవేశం ఉచితమే క‌నుక దీనికి వెళ్లడం వల్ల  అవగాహనతోపాటు  ప్రయోజనం అందుకోవ‌డానికి అవకాశం ఉంటుంది 


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM