ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిఎం కెసిఆర్ సానుకూలం

byసూర్య | Fri, Oct 11, 2019, 08:53 PM

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కెసిఆర్ సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగ సంఘాలు హ ర్షం వ్యక్తం చేశాయి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగుల జెఎసి అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వి.మమత, టిఎన్‌జిఒ ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, టిజిఒ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జ్ఞానేశ్వర్ తదితరులు గురువారం సిఎంను ప్రగతిభవన్‌లో కలిశారు. ప్రగతిభవన్ నుంచి వారికి ఫోన్ రావడంతో వారు సిఎంతో తమ సమస్యలను విన్నవించారు. ఉద్యోగ సంఘాల నేతలను సిఎం ఆ హ్వానించడంతో ఈ సమావేశానికి అధిక ప్రాధాన్య త సంతరించుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు కొన్ని సంవత్సరాలుగా పెం డింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సి ఎంకు విజ్ఞప్తి చేశారు.వారి సమస్యలను విన్న సిఎం కెసిఆర్, అక్టోబర్ 21వ తేదీ తరువాత ఎన్నిక ల కోడ్ ముగియగానే దశలవారీగా ఉద్యోగుల స మస్యలను పరిష్కరిస్తామని ఆయన సంఘాల నే తలతో పేర్కొన్నారు. 30 రోజుల ప్రణాళికను విజయవంతం చేసినందుకు సిఎం ఈ సందర్భంగా ఉ ద్యోగులను అభినందించారు. సిఎం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఈ సందర్భంగా ఉ ద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు సిఎం కెసిఆర్‌కు పుష్పగుచ్ఛం అభినందనలు తెలిపారు. ఉ ద్యోగ సంఘాల నేతలు సిఎం కెసిఆర్‌ను కలిసిన సమయంలో ఉద్యోగుల కరువుభత్యం (డిఏ)పై చర్చించినట్టుగా తెలిసింది. ఉద్యోగులకు 3.44 శాతం కరువుభత్యం చెల్లిస్తానని సిఎం హామీనిచ్చినట్టుగా సమాచారం. ముఖ్యంగా పిఆర్సీపై ఈనెలాఖరులోగా కచ్చితమైన నిర్ణయం తీసుకుంటానని కెసిఆర్ ఉద్యోగులతో పేర్కొన్నట్టుగా తెలిసింది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM