అక్కడ పెద్ద మనుషులు.. ఇక్కడ దొంగలు

byసూర్య | Fri, Oct 11, 2019, 07:19 PM

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 60తులాల బంగారం, రెండు కిలోల వెండి, ఇన్నోవాను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ కు చెందిన నలుగురు ముఠాగా ఏర్పడి దక్షిణాది రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. నిందితులు వారి స్వగ్రామాల్లో వ్యాపారాలు చేస్తూ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. నెలరోజుల పాటు ట్రిప్ కు వెళ్లి వస్తామని బయల్దేరి బయటకు వచ్చాక చోరీలకు పాల్పడుతున్నారు. ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. గత ఐదేండ్లుగా చోరీలకు పాల్పడుతున్నా ఎక్కడా పోలీసులకు చిక్కలేదని, ఖరీదైన కార్లలో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడేవారని సీపీ సజ్జనార్ తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM