ఫలించని ఆర్టీసి ప్రత్యామ్నాయం..?

byసూర్య | Fri, Oct 11, 2019, 06:20 PM

తెలంగాణలో ఆర్టీసి కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయాలు ఫలించడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా బస్సులు అందుబాటులో లేక గంటల తరబడి రోడ్ల పై వేచి చూడాల్సి వస్తుందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు రైళ్లు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ రూట్లలో గంటల కొద్ది నిలబడ్డా బస్సులు రావడం లేదని, ఇదే అదనుగా చేసుకొని ప్రైవేటు వాహనదారులు అందినకాడికి దోచుకుంటున్నారని ప్రజలు తెలిపారు. కొన్ని సర్వీసులు అందుబాటులో ఉన్నా ఇష్టారాజ్యంగా టికెట్ డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ప్రయాణికులు వాపోయారు. ప్రస్తుతం కాలేజిలు ప్రారంభమైనప్పటికి విద్యార్దుల హాజరు శాతం తక్కువగా నమోదవుతుందని విద్యా సంస్థల నిర్వాహకులు తెలిపారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్దులు కాలేజిలకు చేరుకోలేకపోతున్నారు. మరో వైపు పాఠశాలలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్లు అందుబాటులో ఉండరు. ప్రస్తుతం వివిధ ప్రైవేటు విద్యా సంస్థల డ్రైవర్లు టెంపరరీగా ఆర్టీసిలో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. వారు పాఠశాలలు, కాలేజిలు ప్రారంభం కాగానే వెళ్లిపోతారు. పలువురు విద్యార్దులు ప్రస్తుతం టెంపరరీ కండక్టర్లుగా పని చేస్తున్నారు. వారు కూడా కళాశాలలు ప్రారంభం కాగానే వెళ్లిపోతారు. ఈ సమయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం కష్టంగానే ఉంటుందని తెలుస్తోంది. మరో వైపు సమ్మెను ఉధృతం చేసే యోచనలో ఆర్టీసి జేఏసీ నేతలు ఉన్నారు. ఈ నెల 19న తెలంగాణ బంద్ కు కూడా పిలుపునిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని బట్టి 19 వ తేది వరకు అంటే మరో 8 రోజుల పాటు సమ్మె తప్పదని స్పష్టమవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు బస్సులను అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కానీ అది ఫలించకపోవడంతో సీఎం కూడా కాస్త సీరియస్ గానే ఆలోచిస్తున్నారని సమాచారం. ఇప్పటికైనా ప్రజా రవాణా మీద సర్కార్ దృష్టి పెట్టి ప్రజలకు మెరగైన రవాణా సేవలు అందించాలని పలువురు కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల పై సర్కార్ లోని పెద్దలు కాస్త ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM