అధిక చార్జీల వసూలుకు ప్రయాణికులు మోసపోవద్దు: పోలీసులు

byసూర్య | Fri, Oct 11, 2019, 02:54 PM

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తాత్కాలికంగా ఆర్టీసీ, ప్రయివేటు వాహనాలను నడుపుతున్న వారికి, ప్రజలకు ధరలపై అవగాహన కొరకు బస్సు చార్జీలకు సంబంధించిన ధరల పట్టికలను శుక్రవారం బస్సు డిపో ఆవరణలో మంచిర్యాల సంయుక్త పాలన అధికారి సురేందర్ రావు, డీసీపీ ఎల్&ఓ రవికుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి, కిష్టయ్య విడుదల చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు ప్రయివేట్ వాహనదారులకు అధిక చార్జీలు చెల్లించవద్దని కోరారు. ప్రతి వాహనంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన చార్జీలను సూచించడం జరిగిందని పేర్కొన్నారు. మంచిర్యాల డిపో నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సూచిన పట్టిక ఆధారంగా చార్జీలు చెల్లించాలని ప్రయాణికులకు సూచించారు. అధిక ధరలు వసూలు చేసే వారిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్ నంబర్లకు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గౌస్ బాబా, సీఐ చంద్రమౌళి, ఎస్సైలు మారుతి, ఓంకార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM