ఆధార్ కార్డును పోగొట్టుకున్నారా..?

byసూర్య | Fri, Oct 11, 2019, 02:47 PM

ఆధార్ కార్డు ప్రతీ ఒక్కరికీ ఓ అవసరం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఇచ్చే ఆధార్ కార్డు ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా మారిపోయింది. అలాంటి ఆధార్ కార్డును పోగొట్టుకున్నారా. కంగారుపడకండి. ఆధార్ రీప్రింట్ చేసుకోవడం చాలా సులువు. అదెలాగో తెలుసుకుందాం...


యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌ సైట్ www.uidai.gov.in లోకి వెళ్లాలి. ఆధార్ సర్వీసెస్‌ లో 'Order Aadhaar Reprint పైన క్లిక్ చేయండి. 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వీఐడీ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే 'సెండ్ ఓటీపీ' పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ వివరాలు స్క్రీన్‌ పై కనిపిస్తాయి. ఆధార్ వివరాలు వెరిఫై చేసిన తర్వాత 'మేక్ పేమెంట్' ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ లాంటి వాటి ద్వారా రూ.50 చెల్లించాలి. రీప్రింటెడ్ ఆధార్ లెటర్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ రిజిస్టర్డ్ అడ్రస్‌ కు స్పీడ్‌ పోస్ట్‌లో వస్తుంది.


Latest News
 

వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం Wed, Apr 24, 2024, 10:58 AM
ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు Wed, Apr 24, 2024, 10:57 AM
పెళ్లి చేసుకుంటానని మోసం... కేసు నమోదు Wed, Apr 24, 2024, 10:39 AM
ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత Wed, Apr 24, 2024, 10:29 AM
వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM